BigTV English

Bigg Boss 8 Telugu: రోహిణి స్మార్ట్, నిఖిల్ ఎడ్డీ.. హరితేజ లెక్కలు తప్పే ఛాన్సే లేదా?

Bigg Boss 8 Telugu: రోహిణి స్మార్ట్, నిఖిల్ ఎడ్డీ.. హరితేజ లెక్కలు తప్పే ఛాన్సే లేదా?

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో తాజాగా జరిగిన నామినేషన్స్.. కంటెస్టెంట్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కంటెస్టెంటస్స్ దీని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మెగా చీఫ్‌గా ఉన్న అవినాష్ చేతికి బిగ్ బాస్ ఇచ్చిన సూపర్ పవర్ గురించే పాత కంటెస్టెంట్స్ మధ్య డిస్కషన్ మొదలయ్యింది. ఇక అందరు కంటెస్టెంట్స్ గురించి, వారి స్ట్రాటజీల గురించి హరితేజ వేసిన లెక్కలు ఎప్పుడూ గురితప్పవు అని ప్రూవ్ అయ్యింది. అంతే కాకుండా అప్పుడే ఈవారం మెగా చీఫ్ ఎవరు అవుతారు అనే పోటీలు కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో రోహిణి, నబీల్, పృథ్వి తీసుకున్న రిస్క్ వారికి మంచే చేసింది.


యష్మీని వదిలేది లేదు

ముందుగా నామినేషన్స్ గురించి యష్మీతో డిస్కషన్ మొదలుపెట్టాడు నిఖిల్. గౌతమ్‌ను నామినేట్ చేయడానికి తన పేరు చెప్పడం బాలేదని యష్మీ చెప్పినా కూడా ఎవరు ఏం మాట్లాడినా పర్వాలేదని నిఖిల్ సమాధానమిచ్చాడు. పైగా రోహిణిని సేవ్ చేయడం గురించి విష్ణుప్రియా, హరితేజ మధ్య డిస్కషన్ మొదలయ్యింది. గతవారం తను నామినేషన్స్‌లో లేకపోవడానికి రోహిణి సాయం చేయడం వల్లే తనను ఈవారం సేవ్ చేశానని విష్ణుప్రియాతో చెప్పాడు అవినాష్. అదే విషయాన్ని హరితేజతో వచ్చి చెప్పింది విష్ణుప్రియా. రోహిణి అవినాష్‌కు నీడ అని, తను ఏం చేస్తే అదే చేస్తుందని, తనకంటూ సొంతంగా ఒక మాట లేదని రోహిణి గురించి నెగిటివ్‌గా మాట్లాడింది హరితేజ.


Also Read: అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

నబీల్ తెలివి

ఈవారం నబీల్ నామినేషన్స్‌లో లేని విషయంపై కూడా విష్ణుప్రియా, హరితేజ చర్చించారు. నబీల్ చాలా తెలివిగా ఆలోచిస్తాడని, తను ఎలా మాట్లాడితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ముందే ఆలోచించి అడుగు వేసే మనస్తత్వం తనది అంటూ మాట్లాడుకున్నారు. ఈవారం విష్ణుప్రియాను నామినేట్ చేశాడు నబీల్. గతవారం తనను నామినేట్ చేయడం నచ్చలేదని కారణం చెప్పాడు. ఇదిలా ఉండగా.. రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ను నామినేట్ చేశాడు అవినాష్. ఇది పాత కంటెస్టెంట్స్‌కు నచ్చలేదు. యష్మీ అయితే ఈ విషయాన్ని నేరుగా అవినాష్‌తోనే మాట్లాడింది. గతవారం రోహిణికంటే నిఖిల్ బాగా ఆడాడని తనను సమర్ధించింది.

ఆ ముగ్గురు ఒకటి

యష్మీ, ప్రేరణ పట్ల కోపంగా ప్రవర్తించాడని నిఖిల్‌ను నామినేట్ చేశాడు అవినాష్. ఆ విషయాన్ని తామే క్షమించినప్పుడు ఈ కారణం చెప్పి తనను నామినేట్ చేయడం కరెక్ట్ కాదని యష్మీ చెప్పింది. అయినా కూడా రోహిణిని సేవ్ చేయడమే కరెక్ట్ అనే మెంటాలిటీలో ఉన్నాడు అవినాష్. ఇదంతా చూసిన హరితేజ.. నిఖిల్ ఎడ్డి ఫెలో అని, అందుకే ఇంకా అవినాష్‌తో మాట్లాడుతున్నాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎంత చెప్పినా కూడా టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ ఒకటే గ్యాంగ్ అని చెప్పింది. అంతే కాకుండా ఈరోజు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన సూట్‌కేసులను ధైర్యంగా చేతిలోకి తీసుకొని నబీల్, రోహిణి, పృథ్వి మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×