BigTV English

Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్‌కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్.. గంగవ్వ మాటలకు గౌతమ్ షాక్

Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్‌కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్.. గంగవ్వ మాటలకు గౌతమ్ షాక్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్‌కు చాలానే వార్నింగ్స్ వస్తున్నాయి. పోటీ పెరగడంతో కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు కంటెస్టెంట్స్. దీంతో బిగ్ బాస్ ప్రాపర్టీలకు డ్యామేజ్ జరుగుతోంది. తాజాగా మరోసారి బిగ్ బాస్ నుండి కంటెస్టెంట్స్‌కు వార్నింగ్ వచ్చింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ నుండి కంటెస్టెంట్స్‌కు ఒక గుడ్ న్యూస్ రాగా.. ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. మరోసారి అవినాష్ వల్లే కంటెస్టెంట్స్‌కు మరొక లాభం వచ్చింది. ఇక టేస్టీ తేజ, అవినాష్ కలిసి గంగవ్వతో చేయించిన ప్రాంక్ ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచింది. దానివల్లే హరితేజ ఫుల్‌గా ఫూల్ అయ్యింది.


అవినాష్ వల్లే

గతవారం బిగ్ బాస్‌లోని కంటెస్టెంట్స్‌కు లిమిట్‌లెస్‌గా ఫుడ్ లభించింది. దీంతో ఆ ఫుడ్ అంతా చాలా వేస్ట్ అయ్యిందని, హౌస్‌ను శుభ్రంగా ఉంచడం లేదని, రూల్స్‌ను ఫాలో అవ్వడం లేదని.. వీటివల్ల తనకు కోపం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బిగ్ బాస్. అందుకే ఈసారి సూపర్ మార్కెట్‌లో గడిపే సమయాన్ని చాలా తగ్గించేశారు. దీంతో నిఖిల్‌నే సూపర్ మార్కెట్‌లోకి పంపించాడు మెగా చీఫ్ గౌతమ్. టైమ్ తక్కువగా ఉండడంతో తనవల్ల అయిన వస్తువులను తీసుకొచ్చాడు నిఖిల్. ఆ తర్వాత అవినాష్‌ను జిమ్ ట్రైనర్‌గా ఎంటర్‌టైనర్‌ చేయమని చెప్పగా తను అందులో సక్సెస్ అయ్యి కిచెన్ టైమ్ 2 గంటలు పెంచారు బిగ్ బాస్. అంతే కాకుండా సూపర్ మార్కెట్‌లో నిఖిల్ మిస్ అయిన వస్తువులను కూడా తిరిగిచ్చాడు.


Also Read: మా మధ్య గొడవలు లేవు, నా వల్లే ఇలా జరిగింది.. భార్యతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మణికంఠ

హరితేజ నమ్మేసింది

ఎపిసోడ్ అంతా బోరింగ్‌గా సాగిపోతున్న సమయంలో గంగవ్వతో ఘోస్ట్ ప్రాంక్ ప్లాన్ చేశారు టేస్టీ తేజ, అవినాష్. ఆ ప్రాంక్ సూపర్ సక్సెస్ అయ్యింది. హరితేజ.. అది ప్రాంక్ కాదని, నిజమే అని ఫుల్‌గా నమ్మేసింది. అక్కడ అంత జరుగుతున్నా కూడా నిఖిల్, నబీల్, పృథ్వి అసలు లేవలేదు. దీంతో ఉదయం లేవగానే హరితేజ, రోహిణి కలిసి ఈ విషయాన్ని వారికి వివరించారు. అప్పుడే పృథ్వికి ఒక డౌట్ వచ్చింది. నిజంగానే గంగవ్వకు ఏదైనా జరిగుంటే ఆ అర్థరాత్రి సమయంలో తనకు మైక్ ఎలా వేసి ఉందని అడిగాడు. అప్పుడే హరితేజకు తాను ఫూల్ అయ్యాననే విషయం అర్థమయ్యింది. కానీ యాక్టింగ్ మాత్రం బాగా చేసిందని అనుకుంది.

గంగవ్వ రియాలిటీ

గతవారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవాల్సింది. కానీ మణికంఠ తనంతట తానుగా తప్పుకుంటానని చెప్పడంతో గౌతమ్‌కు ఇంకా బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండే అవకాశం దక్కింది. అదే విషయాన్ని తాజాగా గుర్తుచేసింది గంగవ్వ. ‘‘మణికంఠ వెళ్లిపోయాడు కాబట్టే నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో అక్కడే ఉన్న రోహిణి, టేస్టీ తేజ షాకయ్యారు. అలా అంటే బాగుండదు అని రోహిణి చెప్తున్నా సరే.. అది నిజమే కదా అంటూ గట్టిగా అరిచింది గంగవ్వ. ఇక ఫైనల్‌గా రాయల్స్ టీమ్ నుండి ఒకరు మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం రాగా టీమ్ అంతా కలిసి రోహిణిని సెలక్ట్ చేశారు. ఇది హరితేజకు నచ్చలేదు. నిఖిల్‌తో ఈ విషయం చెప్పుకొని బాధపడింది.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×