OTT Movie : ఓటిటిలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మనసుకు హత్తుకుంటాయి. అయితే యూత్ ను ఎంటర్టైన్ చేసే ఒక హాలీవుడ్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు “గెమ్మా బావరి” (Gemma Bovery). ఈ మూవిలో హీరోయిన్ కొంతమందితో నడిపే ఎఫైర్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఫ్రాన్స్ లో ఒక అందమైన పల్లెటూరులో విక్టర్ అనే వృద్ధుడు ఒక బేకరీ నడుపుకుంటూ, హ్యాపీగా కుటుంబంతో జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతానికి లండన్ నుంచి గెమ్మ , చార్లీ అనే జంట ప్రశాంతంగా జీవించడానికి వస్తారు. వీళ్లు ఈ వృద్ధుడి ఇంటికి ఎదురుగానే కొత్త ఇల్లు తీసుకొని ఉంటారు. అయితే ఆమె పేరు తెలుసుకున్న విక్టర్ ఆలోచనలో పడతాడు. అదే పేరుతో అతను ఇష్టపడుతున్న ఒక నవలలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలా ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొద్దిరోజుల్లోనే వాళ్లతో క్లోజ్ అవుతాడు విక్టర్. అయితే చార్లీతో హీరోయిన్ కు మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకసారి హీరోయిన్ కు తేనెటీగ కుట్టగా ముసలివాడు దాని విషాన్ని నోటితో తీస్తాడు. ఈ అవకాశం వచ్చినందుకు మనసులో సంతోషపడతాడు. అయితే అదే ఊరిలో ఉన్న హెన్రీ అనే కుర్రవాడు అందంగా ఉండటంతో అతనితో హీరోయిన్ ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న వృద్ధుడు భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే నవలలో రిలేషన్లు పెట్టుకుంటున్న ఆ క్యారెక్టర్ చివరకు చనిపోతుంది.
ఒక రోజు హీరోయిన్ తో హెన్రీ బ్రేకప్ చెప్తాడు. ఈ విషయం తెలిసిన భర్త ఆమెకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా జరిగినందుకు హీరోయిన్ చాలా బాధపడుతుంది. చివరికి పెళ్లికి ముందు ఒకరితో డేటింగ్ చేసిన హీరోయిన్ అతనితో కొద్దిరోజులు ఉంటుంది. వాడు మంచివాడు కాకపోవడంతో అతనితో కూడా రిలేషన్ కట్ అవుతుంది. ఇదంతా గమనించిన వృద్ధుడు తన స్టోరీలో ఇలా జరిగిందని, నువ్వు సూసైడ్ చేసుకోవద్దంటూ ధైర్యం చెప్తాడు. విక్టర్ తనమీద చూపిస్తున్న కేరింగ్ కి హీరోయిన్ సంతోషపడుతుంది. నేను ఎప్పటికీ అలా చేసుకోను అని నవ్వుకుంటూ ఇంటిలోకి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ చనిపోయి ఉంటుంది. హీరోయిన్ ఎందుకు చనిపోయింది? హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఆ వృద్ధుడు చివరికి ఏమవుతాడు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ “గెమ్మా బావరి” (Gemma Bovery) ని తప్పకుండా చూడండి.