BigTV English

Bigg Boss 8 Telugu: పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజే చేసుకుంటా.. అసలు విషయం బయటపెట్టిన నిఖిల్

Bigg Boss 8 Telugu: పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజే చేసుకుంటా.. అసలు విషయం బయటపెట్టిన నిఖిల్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక ఇది బిగ్ బాస్ హౌస్‌లో వారికి చివరి వారం కావడంతో నామినేషన్స్, గొడవలు లాంటివి ఏమీ లేవు. ఉన్న అయిదుగురు సరదాగా ఆటలు ఆడుకోవడం మొదలుపెట్టారు. అలా దాగుడుమూతలు ఆడుకున్నారు. అంతే కాకుండా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌తో కలిసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి హౌస్‌లోకి కొందరు సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు. సీరియల్ ఆర్టిస్టులు అయిన ప్రభాకర్, ఆమని వచ్చినప్పుడు కంటెస్టెంట్స్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా లవ్ మ్యారేజే చేసుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు నిఖిల్.


ప్రేక్షకులకు థాంక్యూ

ముందుగా బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్.. హరికథ వినిపించాడు. తెలంగాణలో ఇలాంటి హరికథ చాలా ఫేమస్ అని చెప్తూ.. టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి అదే స్టైల్‌లో వివరించారు. ఆ తర్వాత ఈ సీజన్‌ను సక్సెస్‌ఫుల్ చేసినందుకు, తమను టాప్ 5 వరకు తీసుకొచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్యూ చెప్పుకున్నాడు. టైమ్ పాస్ కోసం దాగుడుమూతలు మొదలుపెట్టారు. అందులో అవినాష్.. ముందుగా కంటెస్టెంట్స్‌ను కనిపెట్టే పనిలో పడ్డాడు. ఒకవేళ తను కంటెస్టెంట్స్‌ను కనిపెట్టే కంటే ముందే ఎవరైనా తనను ముట్టుకుంటే మళ్లీ తనే వెళ్లి మొదటినుండి అందరినీ కనిపెట్టాలి అన్నదే గేమ్ రూల్. ఆ ఆటలో ముందుగా నబీల్ ఔట్ అయ్యాడు. దీంతో కంటెస్టెంట్స్ ఎక్కడ దాక్కున్నారో ఇప్పుడు తను కనిపెట్టాలి.


Also Read: బిగ్ బాస్ 8 లో విష్ణు ప్రియా ఎంత సంపాదించిందో తెలుసా..?

వణికిపోయిన అవినాష్

నబీల్ నుండి తప్పించుకోవడానికి కంటెస్టెంట్స్ అంతా యాక్షన్ ఏరియాలో దాక్కున్నారు. ఇళ్లంతా అందరి కోసం వెతికినా కూడా ఎవరూ ఎక్కడా కనిపించలేదు. మెల్లగా వారంతా యాక్షన్ ఏరియా నుండి తొంగిచూడడంతో నబీల్‌కు దొరికిపోయారు. అలా అందరూ బయటికి వచ్చేశారు. కానీ అవినాష్ వచ్చేలోపు డోర్ లాక్ అయిపోయింది. అంతే కాకుండా లైట్స్ కూడా ఆఫ్ అయ్యాయి. యాక్షన్ ఏరియాలో అవినాష్ ఒక్కడే ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో కంటెస్టెంట్స్‌కు చూపించారు బిగ్ బాస్. తను భయంతో ఏడుస్తూ తలుపు తీయమన్నా తీయలేదు. తనతో కాసేపు ఆడుకున్నాడు బిగ్ బాస్. ఇంతలోనే డోర్ ఓపెన్ అయ్యింది. తను బయటికి వచ్చాడు.

పెద్దలను ఒప్పించి

బిగ్ బాస్ హౌస్‌లోకి స్టార్ మా పరివారం నుండి ప్రభాకర్, ఆమని వచ్చారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అడగగా.. లవ్ మ్యారేజ్ చేసుకుంటానని, అందరినీ ఒప్పించే చేసుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు నిఖిల్. అవినాష్‌కు కూడా తనకు లవ్ మ్యారేజే ఇష్టమని చెప్పగా.. అంటే తన భార్య అను అంటే తనకు ఇష్టం లేదా అని అందరూ కాసేపు తనను ఆటపట్టించారు. ఇప్పటికే లవర్ బాయ్‌గా నిఖిల్‌పై ఒక ముద్ర పడింది. ఇప్పుడు లవ్ మ్యారేజే చేసుకుంటానని చెప్పి తన పర్సనల్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు నిఖిల్.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×