BigTV English

Pushpa2 : పుష్ప గాడి లైఫ్ లో విలన్స్ వీరే.. సుక్కు ప్లాన్ మాములుగా లేదు..

Pushpa2 : పుష్ప గాడి లైఫ్ లో విలన్స్ వీరే.. సుక్కు ప్లాన్ మాములుగా లేదు..

Pushpa2 : ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. వచ్చే నెల డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. పుష్ప నేషనల్ వైడ్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. పుష్ప 2 స్టోరి అంతకు మించి ఉంటుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ను చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ మూవీలో మొదటి పార్ట్ కన్నా ఎక్కువ మంది విలన్లు ఇందులో నటిస్తున్నారని తెలుస్తుంది.. పుష్ప గాడితో ఫైట్ చేయబోతున్న ఆ విలన్స్ ఎవరో తెలుసుకుందాం..


భన్వర్ సింగ్ షెకావత్…

ఈయన సినిమాలో తక్కువ సీన్లలో కనిపించినా కూడా పుష్ప పార్ట్ వన్ లో అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు… భన్వర్ సింగ్ షెకావత్. పుష్ప తో ఫ్రెండ్ షిప్ చేసి చివరికి పుష్ప చేతిలోనే అవమానాలపాలు అయిన షెకావత్… రెండో పార్ట్ లో యే రకంగా రివెంజ్ తీర్చుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మై హూ డాన్ అంటూ ట్రైలర్ లో ఎంట్రీ ఇచ్చిన షెకావత్ పుష్ప సామ్రాజ్యాన్ని నాశనం చేసే సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయి..


మంగళం శీను..

మంగళం శీను పాత్రలో సునీల్ నటించారు. తన బామ్మర్ది ని కొన్ని కారణాలతో పుష్ప చంపేస్తాడు. పుష్ప గాడి నిజమైన రైజ్ స్టార్ట్ అవుతుంది. ఎంపీ ఆ తరువాతే మంగళం శీనుని కాదని పుష్ప ని సిండికేట్ లీడర్ ని చేస్తాడు. తన తమ్ముడిని చంపిన పుష్ప మీద పగ తీర్చుకోవాలని మంగళం శీను ని అతని భార్య దాక్షాయణి అడగటం, పీకను బ్లేడ్ తో కోయడం పుష్ప లో చూసాము. ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది..

జాలి రెడ్డి..

కొండా రెడ్డి చిన్న తమ్ముడైన జాలీ రెడ్డి ని చితకబాది వీల్ చైర్ లో కూర్చోబెట్టాడు పుష్ప. శ్రీవల్లి విషయంలో జరిగిన గొడవ లో జాలి రెడ్డి పుష్పా కి శత్రువుగా మారాడు. తన్నులు తిన్నప్పుడే నిన్ను చంపుతా అని జాలీ రెడ్డి పుష్పాతో ఛాలెంజ్ చేస్తాడు. మరి తన అన్న జక్కా రెడ్డి ని కాపాడినందుకు పుష్ప తో సంధి చేసుకుంటాడా? లేక అతని కక్ష్య తీర్చుకుంటాడా చూడాలి..

అంతేకాదు అరగుండు తో ఉన్నది పుష్ప చిన్న అన్న గా నటించిన శ్రీ తేజ్ అని అందరూ అనుకున్నారు. అయితే ఆ అర గుండు తో ఉన్నది దేవర లో నటించిన తారక్ పొన్నప్ప. జాతర లో మెడలో చెప్పుల దండతో కనిపించిన అతని వల్ల పుష్పకు ఏదైనా ప్రమాదం ఉందేమో చూడాలి..

ఇక పుష్ప ఫ్యామిలీ పుష్ప కి చిన్నప్పటి నుండి విరుద్ధం గా ఉంటూనే వస్తుంది. పుష్ప ని తమ ఫ్యామిలీ లో ఒకడిగా ఎప్పటికీ ఒప్పుకోము అంటూ పుష్ప కి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. పుష్ప బాగా సంపాదించి, సమాజం లో పెద్ద అయ్యాక కూడా తన పెళ్లికి రావడానికి కూడా వాళ్లు ఒప్పుకోరు.. వాళ్ళ వల్ల ఏదైనా సమస్యలు వస్తాయేమో చూడాలి.. వీళ్లంతా పుష్ప 2 లో పుష్ప రాజ్ కు వ్యతిరేకంగా ఉంటారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×