OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలను మూవీ లవర్స్ ఎప్పటికి ఆదరిస్తారు. హాలీవుడ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఒక మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
రెండు ఓటిటిలలో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ పేరు “ఇండీసెంట్ ప్రపోజల్” (indecent proposal). ఈ మూవీలో భార్య భర్తల మధ్యలో ఒక డబ్బున్న వ్యక్తి వస్తాడు. అతడు నీ భార్యను నాతో ఒక రాత్రికి పంపిస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్తాడు. వీరి ముగ్గురి మధ్య ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
డేవిడ్, డయానా అనే భార్యాభర్తలు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. వీరిద్దరూ వారి ఉద్యోగాలు చేసుకుంటూ బాగానే ఉండేవారు. అయితే ఇద్దరికీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఉద్యోగాలు పోవడంతో ఫైనాన్షియల్ గా వీక్ అవుతారు. వారి దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉంటుంది. వీరిద్దరూ ఆ డబ్బుతో క్యాసినో ఆడాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ క్యాసినో ఆడటానికి వస్తారు. అక్కడ బిలినియర్ అయిన జాన్ అనే వ్యక్తి డయానాని చూస్తాడు. ఆమె చాలా అందంగా ఉండటంతో అతని కన్ను ఆమెపై పడుతుంది. ఎలాగైనా తనతో ఒక రాత్రి గడపాలని అనుకుంటాడు. మరోవైపు డేవిడ్ డయానా తెచ్చుకున్న డబ్బును క్యాసినో ఆడి పోగొట్టుకుంటారు. వీరిద్దరూ తిరిగి ఇంటికి వెళ్లాలనుకుంటారు. వీళ్ళ దగ్గరికి జాన్ వచ్చి ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. జాన్ ఇచ్చే పార్టీకి వీళ్లిద్దరు అటెండ్ అవుతారు. అక్కడ డేవిడ్ తో జాన్ మాట్లాడుతూ డబ్బుతో కొనలేనివి ఏమీ ఉండవని అంటాడు.
అయితే డేవిడ్ డబ్బుతో కొన్ని కొనలేమని చెప్తాడు. ఏం కొనలేమో చెప్పాలని జాన్, డేవిడ్ ని అడుగుతాడు. మనుషులను కొనలేమని డేవిడ్ సమాధానం చెప్తాడు. అయితే కోటి రూపాయలు నీకు ఇస్తే, నీ భార్యని ఒక రాత్రి పంపుతావా అని అడుగుతాడు. దీనికి నీ సమాధానం చెప్పాలని డేవిడ్ తో జాన్ అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా డయానా అక్కడికి వస్తుంది. జాన్ మాటలు విన్న డయానా కోపగించుకుంటుంది. చివరికి జాన్ పెట్టిన ప్రపోజల్ కి డేవిడ్, డయానా ఒప్పుకుంటారా? జాన్ ప్రపోజల్ ని వీళ్లిద్దరూ తిరస్కరిస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఇండీసెంట్ ప్రపోజల్” (indecent proposal) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని ఒక నవల ఆధారంగా చిత్రీకరించారు. 1993 లో వచ్చిన ఈ మూవీపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఆ సంవత్సరంలోనే అత్యధిక కలెక్షన్స్ ను ఈ మూవీ రాబట్టింది.