Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో విష్ణుప్రియా, పృథ్వి మధ్య జరిగే లవ్ ట్రాకే చాలా డిఫరెంట్. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్‌లో ప్రేమకథలు చాలానే ఉన్నాయి. అందులో వన్ సైడ్ లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి. కానీ ఒక అమ్మాయి.. అబ్బాయి వెంట పడే ఈ రేంజ్ వన్ సైడ్ లవ్ స్టోరీ మాత్రం ఏ సీజన్‌లోనూ జరగలేదు. అయితే ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది. పృథ్వి అంటే తనకు చాలా ఇష్టం అని విష్ణుప్రియా చెప్తూ ఉన్నా కూడా పృథ్వి మాత్రం తను నా ఫ్రెండ్ అనే పూర్తి క్లారిటీలో ఉన్నాడు. తాజాగా మరోసారి విష్ణుప్రియా మనసును గాయపరిచేలా అందరి ముందు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు పృథ్వి. విష్ణు మాత్రం ఇవన్నీ తనకు అలవాటు అయినట్టుగా లైట్ తీసుకుంది.
తేజ సింపథీ గేమ్
ప్రస్తుతం బిగ్ బాస్ 8లో టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో ఈ టాస్కులు ఆడించడం కోసం మాజీ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ 3కు చెందిన వితికా షేరు, పునర్నవి హౌస్‌లోకి వచ్చారు. అందరితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పిన తర్వాత వారితో కలిసి ట్రూ ఆర్ డేర్ గేమ్ ఆడారు. అందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ పర్సనల్ ప్రశ్నలు అడిగారు. ముందుగా టేస్టీ తేజ సింపథీ గేమ్ ఆడుతున్నాడని వితికా అనగానే ఒక టాస్క్‌లో తాను ఓడిపోయినందుకు బాధలో గ్రూప్ గేమ్ గురించి, సపోర్ట్ గురించి మాట్లాడానని, అది సింపథీ గేమ్ కాదని సమాధానం ఇచ్చాడు తేజ.
Also Read: టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు.. ఉత్కంఠ రేపుతున్న ఓటింగ్..!
నబీల్ సింగిల్
ట్రూ ఆర్ డేర్‌లో బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ చెప్పిన అతిపెద్ద అబద్ధం గురించి చెప్పమని వితికా, పునర్నవి అడిగారు. తను పలు సందర్భాల్లో మానసిక కృంగిపోయినా కూడా తాను అలా కాదని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని అబద్ధం చెప్పానని ఓపెన్‌గా చెప్పేశాడు. హౌస్‌లో లవ్ కనిపించలేదా అని నబీల్‌ను అడగగా.. హౌస్‌లో లేదు అని సమాధానమిచ్చాడు నబీల్. అయితే బయట ఉందా అంటూ అందరూ తనను లాక్ చేశారు. బయట కూడా తనకు ప్రేమకథ లేదని, తను సింగిల్ అని అన్నాడు. నిజం చెప్పమని ఎంత అడిగినా అదే నిజమని తప్పించుకున్నాడు నబీల్. చివరికి వితికా, పునర్నవి ఫోకస్ పృథ్విపై పడింది.
సపోర్ట్ కోసమే
పృథ్వి, విష్ణుప్రియా మధ్య ఉంది ప్రేమా? స్నేహమా? అని అడిగింది పునర్నవి. అయితే విష్ణును తను పూర్తిగా ఫ్రెండ్‌లాగానే చూస్తున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు పృథ్వి. అదే ప్రశ్న విష్ణును అడగగా.. పృథ్వి తన ఫ్రెండే అని, కానీ 20 శాతం ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పింది. బయట ప్రేక్షకులు చూస్తున్నదాని ప్రకారం.. విష్ణుప్రియా స్నేహాన్ని అడ్డం పెట్టుకొని పృథ్వి గేమ్‌లో ముందుకు వెళ్తున్నట్టు ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చింది పునర్నవి. దానికి పృథ్వి ఒప్పుకోలేదు. విష్ణు తనకు మంచి సపోర్ట్ అని, కానీ తను ముందుకు వెళ్లడం కోసం విష్ణు స్నేహం తనకు అవసరం లేదని ముక్కుసూటిగా చెప్పేశాడు. అలా అని విష్ణుప్రియాతో స్నేహం తనను వెనక్కి లాగుతుందని కూడా అనుకోవడం లేదన్నాడు పృథ్వి.