Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో తాజాగా ఒక వెరైటీ నామినేషన్స్ ముగిశాయి. హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి లోపల ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసి వెళ్లారు. అందులో భాగంగా సీత వచ్చి యష్మీని నామినేట్ చేసింది. నిఖిల్‌తో ఉండడం వల్ల తన గేమ్ తగ్గిపోతుందని కారణం చెప్పింది. అంతే కాకుండా హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ అమ్మాయిలను నిఖిల్ టార్గెట్ చేసి వారి గేమ్‌లో జోక్యం చేసుకొని వారిని తన గేమ్ కోసం ఉపయోగించుకుంటున్నాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయంపై నిఖిల్ చాలాసేపు ఫీలయ్యాడు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో యష్మీతో ఈ విషయం గురించే మాట్లాడాడు.
యష్మీతో డిస్కషన్
నిఖిల్, యష్మీ మధ్య ఏదో ఉందని కంటెస్టెంట్స్ సైతం ఫీలయ్యారు. కానీ వారిద్దరూ మాత్రం మాకేం కనిపించడం లేదు అంటూ వారి లోకంలో వారే ఉన్నారు. నిఖిల్ తల్లి, యష్మీ తండ్రి వచ్చి వారికి ఇదే చెప్పాలని ట్రై చేసినా వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే సీత ఇచ్చిన స్టేట్‌మెంట్ వారికి షాకింగ్ అనిపించింది. అదే విషయంపై యష్మీతో మాట్లాడి క్లియర్ చేసుకుందామనుకున్నాడు నిఖిల్. సీత అలా మాట్లాడుతున్నప్పుడు తను ఎందుకు తిరిగి మాట్లాడలేదని తనను ప్రశ్నించాడు. తను అలా అంటుందని ఊహించలేదని, అందుకే షాక్‌లో ఉన్నానని చెప్పింది యష్మీ. తన తండ్రి వచ్చి గ్రూప్‌గా ఆడకు అని చెప్పినప్పుడు కూడా తనకు పూర్తిగా అర్థం కాలేదని చెప్పింది.
Also Read: ఇదెక్కడి పూజరా బాబోయ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!
ఓట్లు వేయొద్దు
యష్మీ, నిఖిల్ మాట్లాడుకున్న తర్వాత ఎవరి గేమ్‌పై వారు ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఒంటరిగా కూర్చున్న నిఖిల్.. తనకు అస్సలు హౌస్‌లో ఉండడం ఇష్టం లేదని, ఈవారం తాను నామినేషన్స్‌లో ఉన్నాడు కాబట్టి తనను ఎలిమినేట్ చేసేయమని ప్రేక్షకులను కోరాడు. ఓట్లు వేయొద్దని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నబీల్ వచ్చి మోటివేట్ చేయగానే నిఖిల్ మాటే మారిపోయింది. తాను హౌస్‌లోనే ఉంటానని, తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడమని ఆడియన్స్‌ను అడిగాడు. ఈవారం నామినేషన్స్‌లో ఉన్నాను కాబట్టి ఓట్లు వేసి సేవ్ చేయమన్నాడు. నిఖిల్ ఇలా మాట మార్చడం చూస్తుంటే అసలు తనకు ఏమైంది అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
సపోర్ట్ కావాలి
ఇక బిగ్ బాస్ 8లో చివరి మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి పోటీ మొదలయ్యింది. సమయానుసారం హౌస్‌లోకి కంటెస్టెంట్స్ పేరుపై వచ్చే టీషర్ట్స్‌ను వారు కాపాడుకోవాలి. ఎవరైతే అలా కాపాడుకోగలరో వారే మెగా చీఫ్ కంటెండర్లు అవుతారు. ఈ టాస్క్‌లో ఒకరికి మరొకరి సపోర్ట్ కచ్చితంగా అవసరం ఉంటుంది. ముందుగా ప్రేరణ టీషర్ట్ లోపలికి రాగా తను మళ్లీ మెగా చీఫ్ అవ్వడం ఇష్టం లేని కంటెస్టెంట్స్ అంతా కలిసి తన టీషర్ట్‌ను చింపేశారు. అవినాష్, గౌతమ్, నబీల్ టీషర్ట్స్ కూడా చిరిగిపోయాయి. ఇప్పటికీ టేస్టీ తేజ, యష్మీ, విష్ణుప్రియా, పృథ్వి టీషర్ట్స్ మాత్రమే సేఫ్‌గా ఉన్నాయి కాబట్టి వారు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు.