BigTV English

OTT Movie : పిల్లాడికి మాత్రమే కనిపించే ఆత్మ… తల్లిదండ్రులను చంపించే ప్లాన్

OTT Movie : పిల్లాడికి మాత్రమే కనిపించే ఆత్మ… తల్లిదండ్రులను చంపించే ప్లాన్

OTT Movie : ఓటిటిలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నా వాటిలో హారర్ మూవీస్ లెక్క వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు తెలుగులో కూడా హారర్ మూవీస్ ను ఓ రేంజ్ లో తీస్తున్నారు మేకర్స్. అయితే హాలీవుడ్ హర్రర్ సినిమాలు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. వెన్నులో వణుకు పుట్టించే ఒక హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీ లలో

ఈ హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “కాబ్ వెబ్” (Cobweb). ఒక చిన్న పిల్లవాడికి ఒక వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒళ్ళు గగుర్పాటుచేసే విన్యాసాలను చేస్తుంది. ఈ మూవీని చూస్తే గుండెల్లో దడ పుట్టి పైప్రాణాలు పైకి పోతాయి. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) యాపిల్ టీవీ (apple tv) స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఊరికి కాస్త దూరంగా పీటర్ ఫ్యామిలీ ఉంటుంది. 8 సంవత్సరాలు ఉన్న పీటర్ లోన్లీ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇతనికి ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. అయితే పీటర్ ఇంట్లో ఒక వాయిస్ ఇతనిని పలకరిస్తూ ఉంటుంది. భయపడిన పీటర్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తాడు. వాళ్లు ఇతనిని నమ్మకుండా లైట్ తీసుకుంటారు. అయితే పీటర్ స్కూల్లో కూడా డల్ గా ఉండటంతో టీచర్ అతనికి కాస్త ధైర్యం చెబుతూ ఉంటుంది. ఒకరోజు స్కూల్లో పీటర్ ని టీచర్ మెచ్చుకుంటుంది. ఈ విషయం బ్రెయిన్ అనే మరొక స్టూడెంట్ కి కోపం తెప్పిస్తుంది. ఆ స్టూడెంట్ పీటర్ ని టీజ్ చేస్తాడు. ఇంటికి వచ్చిన పీటర్ ఆ అదృశ్య శక్తితో మాట్లాడుతాడు. తనని స్కూల్లో ఏడిపిస్తున్నారని చెప్తాడు. మరుసటి రోజు అదృశ్య శక్తి చెప్పినట్టు బ్రెయిన్ ను పీటర్ భయపెడతాడు. ఆ ప్రమాదంలో బ్రెయిన్ కి కాలు విరుగుతుంది.

స్కూల్ నుంచి పీటర్ ని డిస్మిస్ చేస్తారు. పీటర్ఇలా చేసినందుకు తల్లిదండ్రులు ఒక చీకటి గదిలో బంధిస్తారు. ఆ గదిలో నుంచి ఆ అదృశ్య శక్తి పీటర్ తో మాట్లాడుతుంది. మీ తల్లిదండ్రులు మంచివాళ్లు కాదని, నన్ను కూడా మీ తల్లిదండ్రులు చంపారు అని చెప్పింది. ఇందుకు సాక్ష్యంగా పెరట్లో తన శవం ఉందని ఆ బాలుడికి చెప్తుంది. పీటర్ పెరట్లో తవ్వగా ఒక అస్తిపంజరం కనబడుతుంది. ఒకరోజు తల్లిదండ్రులు తింటున్న ఫుడ్ లో పీటర్ విషం కలుపుతాడు. పీటర్ తినకుండా ఉండటం చూసి తల్లిదండ్రులకు డౌట్ వస్తుంది. ఇందులో ఏం కలిపావ్ అంటూ గట్టిగా మందలిస్తారు. ఈలోగా తండ్రి రక్తం కక్కుకొని చచ్చిపోతాడు. తల్లి తీవ్రంగా గాయపడుతుంది. చివరికి పీటర్ ఆ మాట్లాడుతున్న దయ్యం ఎవరో  తెలుసుకోగలుగుతాడా? చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి అదృశ్య శక్తి కి పీటర్ సహాయపడతాడా? తల్లిదండ్రులను  పీటర్ ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తాడు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×