OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొద్ది రోజులలోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో చూడకపోయినా ఓటిటిలో మాత్రం తమకు నచ్చిన సినిమాలు చూడగలుగుతున్నారు మూవీ లవర్స్. డబ్బు ఆశ ఎక్కువగా ఉంటే ఆ ఫ్యామిలీ ఏమవుతుందో ఒక బెంగాలీ మూవీలో చక్కగా చూపించారు. ఈ బెంగాలీ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
చోర్కి (Chorki)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “సురంగో” (Surongo). ఈ మూవీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు డబ్బు పిచ్చివుండడంతో భర్తను ఎలా మోసం చేసిందనే కథ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ చోర్కి (Chorki) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మసూద్ అనే వ్యక్తి ఎలక్ట్రిషన్ గా పని చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి అదే ఊరిలో మొయిన అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఈమెకు తల్లిదండ్రులు చనిపోవడంతో పెళ్లి చేసి పంపేయాలని ఆమె వదిన చూస్తూ ఉంటుంది. ఇంతలో మసూద్ మొయిన ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరికాపురం బాగానే సాగుతుంది. అయితే ఆ తర్వాత మొయిన తన భర్తను డబ్బులు సంపాదించాలని ఒత్తిడి చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ లోని తన బంధువుల ద్వారా మసూద్ ని దుబాయ్ కి వెళ్లాలని చెప్తుంది. మసూద్ కి ఇష్టం లేకపోయినా భార్య ఒత్తిడి మేరకు దుబాయ్ కి వెళ్లాలనుకుంటాడు. జోహేల్ అనే ఫ్రెండ్ తో తన భార్యకు సహాయంగా ఉండమని చెప్తూ మసూద్ దుబాయ్ కి వెళ్తాడు. అయితే జోహిల్ మసూద్ భార్యపై కన్నేస్తాడు. ఆమెకు డబ్బు పిచ్చి ఉండటంతో ఆమెకు కావాల్సిన వస్తువులు ఇస్తూ బంగారం కూడా కొనిస్తాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ సరసాలు ఆడుతూ ఉంటారు. భర్తను మర్చిపోయి జోహేల్ తో పడకను పంచుకుంటూ ఉంటుంది. భార్యపై అనుమానం వచ్చిన మసూద్ దుబాయ్ నుంచి తిరిగి ఇంటికి వస్తాడు.
అప్పటికే మొయినా ఇంటి నుంచి జోహేల్ తో వెళ్లిపోయి ఉంటుంది. అతి కష్టం మీద మసూద్ ఆమె ఉన్న చోటును కనుక్కొని వెళ్తాడు. అయితే మొయినా ఇతనితో రావడానికి ఇష్టపడుదు. డబ్బులు ఉంటేనే తనతో ఉంటుందని గ్రహించిన మసూద్ ఒక పథకం వేస్తాడు. ఒక సొరంగం తవ్వి బ్యాంకు రాబరీ చేస్తాడు. అయితే ఇతనిని పట్టిస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు ప్రకటన చేస్తారు. ఈ విషయం తెలిసిన మొయిన 5 లక్షల కోసం పోలీసులకు సమాచారం ఇస్తుంది. పోలీసులు మోయిన ద్వారా మసూద్ ను పట్టుకుంటారు. అయితే అప్పటికే లూటీ చేసిన డబ్బులను ఎవరో దొంగలించారని పోలీసులకు మసూద్ చెప్తాడు. 5 లక్షల కోసం నన్ను పట్టిస్తావా అంటూ మొయినాపై మసూద్ మండిపడతాడు. చివరకు ఈ కేసు నుంచి మసూద్ బయటపడతాడా? మొయినా తన తప్పు తెలుసుకుంటుందా? ఇంత చేసిన భార్యను మసూద్ మళ్లీ దగ్గరికి రానిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.