BigTV English

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లలాటలు.. నిఖిల్ వర్సెస్ మణికంఠలో ఎవరు గెలుస్తారు?

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లలాటలు.. నిఖిల్ వర్సెస్ మణికంఠలో ఎవరు గెలుస్తారు?

Bigg Boss 8 Telugu Latest Promo : బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆడుతున్న మొదటి టాస్క్.. బీబీ హోటల్. ఈ టాస్క్‌లో ఓజీ టీమ్ అంతా హోటల్ స్టాఫ్‌గా నటిస్తుండగా.. రాయల్స్ టీమ్ అంతా గెస్టులుగా వ్యవహరిస్తున్నారు. గెలిచిన టీమ్‌కు, అందులోని సభ్యులను మెగా చీఫ్ అయ్యే ఛాన్సులు ఉంటాయని బిగ్ బాస్ ముందుగానే ప్రకటించారు. అయితే ఓజీ టీమ్ నుండి ఎవరు మెగా చీఫ్ కంటెండర్ అయితే బాగుంటుందని రాయల్స్ టీమ్ డిస్కషన్ మొదలుపెట్టింది. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


యష్మీకే ఓటు

ఓజీ టీమ్ నుండి ఎవరు చీఫ్ కంటెండర్ అయితే బాగుంటుందో చెప్పండి, ఓటింగ్ చేద్దాం అని గౌతమ్ చెప్పడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. వెంటనే యష్మీ, సీత పేర్లు చెప్పింది హరితేజ. నయని పావని.. మణికంఠ పేరు చెప్పింది. ఆ తర్వాత మెహబూబ్ కూడా యష్మీ పేరే చెప్పాడు. రోహిణి కూడా ముందుగా యష్మీ పేరే చెప్పి ఆ తర్వాత నబీల్ అయినా ఓకే అని చెప్పింది. ‘‘ఓనర్ క్యారెక్టర్‌కు ఎక్కువ స్కోప్ లేకపోయినా తను ట్రై చేస్తున్నాడు. ఒకవైపు మనతో మాట్లాడుతున్నాడు. మరోవైపు వాళ్లతో మాట్లాడుతున్నాడు’’ అని నబీల్ గురించి పాజిటివ్‌గా మాట్లాడింది. ఆ డిస్కషన్ అయిపోయే సమయానికి యష్మీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.


Also Read: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. విరగబడి నవ్వడం పక్కా..!

ఎవరి బలమెంత?

ఆ తర్వాత ఓజీ టీమ్‌కు ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ‘‘నిన్నటి నుండి మీరు స్టాఫ్‌ను గమనించారు. ఇప్పుడు వారి బలమేంటో తెలుసుకునే సమయం వచ్చింది’’ అంటూ ఓజీ టీమ్‌తో ఆటలు ఆడించే బాధ్యతను రాయల్స్‌కు ఇచ్చారు. ముందుగా ఓజీ టీమ్ అంతా కప్పగంతులు ఆట ఆడింది. ఆ ఆట నుండి యష్మీ, ప్రేరణ ఔట్ అయ్యారు. ఆ తర్వాత ఆడిన లెమన్ అండ్ స్పూన్ గేమ్‌లో చివరిగా రావడంతో నబీల్, పృథ్వి ఆట నుండి పక్కకు తప్పుకున్నారు. చివరి గేమ్‌ కోసం నిఖిల్, మణికంఠ, సీత, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఈ గేమ్‌లో నిఖిల్, మణికంఠ మధ్య గట్టి పోటీ జరిగింది. తన బలం నిరూపించుకోవాలని మణికంఠ చాలానే ప్రయత్నించాడు.

బ్యాలెన్స్ చేయలేకపోయారు…

ఈ టాస్క్‌లో తమ కాలిని మరో కాలిపై పెట్టుకొని నిలబడి.. రెండు చేతుల్లో రెండు గ్లాసుల నిండా నీటిని పట్టుకోవాలి. అలా ఎవరు ఎక్కువసేపు బ్యాలెన్స్ చేస్తారో వారే విన్నర్స్. ముందుగా ఈ ఆట నుండి విష్ణుప్రియా తప్పుకుంది. సీత కూడా నిఖిల్, మణికంఠకు పోటీ ఇవ్వాలని చాలానే ప్రయత్నించింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా తనను ఎంకరేజ్ చేశారు. కానీ బ్యాలెన్స్ చేయలేక తప్పుకుంది. చివరికి నిఖిల్, మణికంఠ మాత్రమే మిగిలారు. మొత్తానికి ఈ ఇద్దరిలో ఈ టాస్క్ ఎవరు గెలిచారో తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ చూడాల్సిందే. నాలుగు వారాలు చీఫ్‌గా ఉన్నా కూడా నిఖిల్‌కు ఆ పదవిపై ఆశ పోలేదని బీబీ హోటల్ టాస్క్‌లో తన ప్రవర్తన చూస్తే అర్థమవుతోంది.

Related News

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Big Stories

×