National Conference Leader Omar Abdullah will take oath as J&K Chief Minister : నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేటివ్ ఫ్లోర్ లీడర్ గా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శ్రీనగర్‌లో గురువారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
Also Read : రతన్ టాటాను తలుచుకుని కంటతడి పెట్టిన కేంద్రమంత్రి..
సీఎంగా ఆదివారం లేదా సోమవారం
జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మిత్రపక్షాలతో శుక్రవారం మరో సమావేశం నిర్వహిస్తున్నామని ఫరూక్ వెల్లడించారు. దీంతో ఆదివారం లేదా సోమవారం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.