Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5 కంటెస్టెంట్స్ చివరి వారానికి చేరుకున్నా కూడా ఇంకా వారి ప్రైజ్ మనీని పెంచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ వారికి అందిస్తూనే ఉన్నారు. సమయానుసారం హౌస్‌లోకి మా పరివారానికి చెందిన సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూ.. వారితో కంటెస్టెంట్స్ పోటీపడేలా చేస్తున్నారు. ఇప్పటివరకు అలా ఎందరో సీరియల్ ఆర్టిస్టులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినా.. కంటెస్టెంట్స్‌తో పోటీపడినా కూడా ఆ టాస్కుల్లో బీబీ పరివారమే గెలుస్తూ వస్తోంది. తాజాగా మరో ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు హౌస్‌లోకి ఎంటర్ అయినట్టుగా ప్రోమో విడుదలయ్యింది. ప్రైజ్ మనీని పెంచుకోవడానికి వారితో కూడా పోటీకి దిగింది బీబీ పరివారం.
ఫన్నీ యాక్టివిటీ
మా పరివారం నుండి వచ్చిన వైష్ణవి, కృష్ణలకు బిగ్ బాస్ పరివారంలోకి స్వాగతం పలికారు బిగ్ బాస్. ‘‘బిగ్ బాస్ మీకొక ఫన్నీ యాక్టివిటీని ఇస్తున్నారు. ఈ యాక్టివిటీలో భాగంగా మీకు పంపిన క్యూ కార్డ్స్‌లో ఉన్న పదాలకు అనుగుణంగా ఎనాక్ట్ చేయాల్సి ఉంటుంది’’ అంటూ బిగ్ బాస్ నుండి వచ్చిన లేఖను చదివాడు అవినాష్. దాంతో ఫన్నీ యాక్టివిటీ మొదలయ్యింది. ముందుగా నబీల్ వచ్చి యాక్టింగ్ చేసి చూపించగా.. అది జిరాఫీ అని కరెక్ట్‌గా గెస్ చేసింది వైష్ణవి. ఆ తర్వాత అవినాష్ వచ్చి కోతిలాగా యాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అది కోతి అని క్లియర్‌గా అర్థమవుతున్నా కూడా వైష్ణవి, కృష్ణ కలిసి కాసేపు తనతో ఆడుకుందామని ఫిక్స్ అయ్యారు.
Also Read: హౌస్ లోకి సీరియల్ యాక్టర్స్.. సందడి మామూలుగా లేదుగా..!
వారితో పోటీ
కోతిలాగా అవినాష్ ఎంత యాక్ట్ చేసినా కూడా వైష్ణవి, కృష్ణ కలిసి సరైన సమాధానం చెప్పలేదు. చివరికి కోతి.. అరటిపండును ఎలా తింటుందో అలాగే తిని చూపించాడు అవినాష్. ‘‘కోతి అరటిపండును తొక్కతో పాటు తినేస్తుంది. అది కోతి కాదు’’ అని కృష్ణ అన్నాడు. అలా మా పరివారం, బీబీ పరివారం అంతా కలిసి ఈ ఫన్నీ యాక్టివిటీని పూర్తిచేశారు. ఆ తర్వాత అసలు ఆట మొదలయ్యింది. వారితో పోటీ పడడం కోసం అవినాష్, ప్రేరణలను ఎంచుకున్నారు వైష్ణవి, కృష్ణ. ఈ టాస్కులో హెయిర్ డ్రయర్‌పై బాల్‌ను బ్యాలెన్స్ చేస్తూ దానిని జాగ్రత్తగా తీసుకెళ్లి అవతల వైపు ఉన్న బౌల్‌లో వేయాలి. ఈ టాస్క్ కోసం నలుగురు చాలానే కష్టపడ్డారు.
కంటెస్టెంట్స్‌దే పైచేయి
మొత్తానికి సీరియల్ ఆర్టిస్టులు హౌస్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల బిగ్ బాస్ 8కు సంబంధించిన విన్నర్స్ ప్రైజ్ మనీ పెరుగుతూనే ఉంది. మా పరివారం రావడం వల్ల కంటెస్టెంట్స్‌కు ఒకవైపు ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మరోవైపు లాభాలు కూడా బాగానే అందుతున్నాయి. ఇప్పటివరకు ప్రసారమయిన ఎపిసోడ్స్‌లో నాలుగు సీరియల్స్‌కు సంబంధించిన ఆర్టిస్టులు హౌస్‌లోకి ఎంటర్ అవ్వగా వారందరితో కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ఆ నలుగురిపై బీబీ పరివారమే గెలిచింది. ఇక బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఎవరు గెలుస్తారు? ప్రైజ్ మనీ పెరుగుతుందా లేదా? అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.