BigTV English

Bigg Boss 8 Telugu Promo: యష్మీపై అరిచిన గౌతమ్.. ఓజీ టీమ్ కోసం నబీల్ ఫైట్, ఈసారి మెగా చీఫ్ అయ్యేదెవరు?

Bigg Boss 8 Telugu Promo: యష్మీపై అరిచిన గౌతమ్.. ఓజీ టీమ్ కోసం నబీల్ ఫైట్, ఈసారి మెగా చీఫ్ అయ్యేదెవరు?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మెగా చీఫ్ ఎవరు అనే పోటీ మళ్లీ మొదలయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌కు గౌతమ్ మెగా చీఫ్‌గా ఉన్నాడు. ఇప్పుడు గౌతమ్ స్థానంలో మరొకరు రావాల్సిన సమయం వచ్చేసింది. మెగా చీఫ్ అయ్యేవారి కోసమే బీబీ రాజ్యం అనే టాస్కును పెట్టాడు బిగ్ బాస్. అందులో గెలిచిన టీమ్ నుండి ఒక్కొక్కరు మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఇప్పటివరకు బీబీ రాజ్యంలో దాదాపు అన్ని టాస్కులు పూర్తయ్యాయి. తాజాగా ఇందులో మరొక టాస్క్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా మొదటిసారి యష్మీపై అరిచాడు గౌతమ్. అంతే కాకుండా ఎవరు మెగా చీఫ్ అవుతారు అనే నిర్ణయాన్ని ఇతర కంటెస్టెంట్స్ చేతిలో పెట్టాడు.


నీకు సంబంధం లేదు

బీబీ రాజ్యంలో క్విజ్ టాస్క్ జరిగింది. దానికి నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఆ టాస్క్‌లో గెలిచింది ఎవరు అని నిఖిల్‌ను బిగ్ బాస్ అడగడంతో ఈ ప్రోమో మొదలవుతుంది. ప్రేరణ, గౌతమ్ ఆడిన ఆటలో గౌతమ్ రెండు ఆన్సర్లు ఇచ్చాడు. దానిని ఎలా తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ మొదలయ్యింది. అందుకే ప్రేరణ.. గౌతమ్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలని ప్రయత్నించింది. ‘‘మీరు విన్ అయినా సరే ముందు నేను చెప్పే మాట వినండి’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు గౌతమ్. మధ్యలో యష్మీ వచ్చి మాట్లాడాలనుకుంది. ‘‘నీకు ఇందులో సంబంధం లేదు. ఇక్కడి నుండి వెళ్లిపో’’ అని యష్మీపై అరిచాడు గౌతమ్. దీంతో యష్మీ అక్కడి నుండి సైలెంట్‌గా వెళ్లిపోయింది.


Also Read: పృథ్వీ vs టేస్టీ తేజ.. మీలో ఎవరు తెలివైన వారు..?

వారి చేతిలో నిర్ణయం

ఫైనల్‌గా ఓజీ టీమ్ నుండి నిఖిల్, ప్రేరణ, పృథ్వి, విష్ణుప్రియా మెగా చీఫ్ కంటెండర్స్ అయ్యారు. రాయల్స్ టీమ్ నుండి టేస్టీ తేజ, రోహిణి మెగా చీఫ్ రేసులో ఉన్నారు. ‘‘మీలో నుండి ఎవరిని మెగా చీఫ్ చేయాలి, ఎవరిని తొలగించాలి అనేది మీ తోటి ఇంటి సభ్యుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది’’ అని బిగ్ బాస్ వివరించారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీని ఎవరైతే ముందుగా వెళ్లి అందుకుంటారో.. వారు మెగా చీఫ్ కంటెండర్స్ నుండి ఒకరిని తొలగించే అవకాశం లభిస్తుంది. ముందుగా మెహబూబ్ చేతికి ఆ ప్రాపర్టీ వచ్చింది. తను తన టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు ఓపెన్‌గా చెప్పాడు. తర్వాత వచ్చిన నబీల్ కూడా అదే ఫాలో అవుతున్నానని అన్నాడు.

నబీల్ పోటీ

టీమ్ గురించి పక్కన పెడితే ఎవరు మెగా చీఫ్ అయితే బాగుంటుందో వారికే సపోర్ట్ చేస్తానని అన్నాడు అవినాష్. ‘‘తేజను కాపాడుకోవడం ఎంత అవసరమో.. వాళ్ల సైడ్ నుండి ఎవరు మెగా చీఫ్ అయితే బాగుంటుందో వాళ్లను ఉంచుకోవడం కూడా అంతే అవసరం. కనీసం బ్రెయిన్ గేమ్ అయినా ఆడితే బెస్ట్ అని నా ఫీలింగ్’’ అంటూ తన స్ట్రాటజీ గురించి చెప్పుకొచ్చింది హరితేజ. గత రెండు వారాలుగా రాయల్స్ నుండే మెగా చీఫ్ అవుతున్నారని, ఇప్పటికైనా ఓజీ టీమ్‌కు రావాలని నిఖిల్‌తో అన్నాడు నబీల్. తన టీమ్ సభ్యుడిని మెగా చీఫ్ చేయడం కోసం ఫైట్ మొదలుపెట్టాడు నబీల్. మెహబూబ్ చేతి నుండి ప్రాపర్టీ లాక్కున్నాడు. పృథ్వి కూడా తననే ఎంకరేజ్ చేశాడు.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×