E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu Promo: కొంపలు ముంచుతున్న నామినేషన్స్.. మండితేనే నామినేట్ చేస్తారట!

Bigg Boss 8 Telugu Promo: కొంపలు ముంచుతున్న నామినేషన్స్.. మండితేనే నామినేట్ చేస్తారట!
Advertisement

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో గతవారం జరిగిన విషయాలను మనసులో పెట్టుకొని ఈవారం నామినేషన్స్‌లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ సంఖ్య చాలానే ఉంది. గతవారం ప్రేరణ, హరితేజ చేతిలోనే నామినేషన్స్ అధికారం ఉంది. అందుకే వాళ్లిద్దరే ఈసారి నామినేషన్స్‌లో ఇతర కంటెస్టెంట్స్‌కు టార్గెట్ అయ్యారు. ముఖ్యంగా ప్రేరణను నామినేట్ చేయాలని చాలామంది ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ నామినేషన్స్‌కు సంబంధించిన మరొక ప్రోమో విడుదలయ్యింది. అందులో మెహబూబ్, ప్రేరణనే ఇతర హౌస్‌మేట్స్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. హరితేజ, ప్రేరణ మధ్య జరిగిన డిస్కషన్ ఆసక్తికరంగా మారింది.

పృథ్వి నీతులు

Advertisement

‘‘గతవారం నామినేషన్ పాయింట్‌తోనే నామినేట్ చేస్తున్నాను’’ అంటూ పృథ్వి వచ్చి ప్రేరణను నామినేట్ చేయడంతో ఈ బిగ్ బాస్ ప్రోమో ప్రారంభమయ్యింది. ‘‘నాకు నామినేషన్స్ పాయింట్స్‌లో నువ్వు, తేజ సేమ్ అనిపించారు. ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నాకు తెలిసింది కూడా చెప్పాను’’ అని క్లారిటీ ఇచ్చింది ప్రేరణ. షార్ట్ టెంపర్ ఉంది అని మరొక కారణం చెప్పాడు పృథ్వి. షార్ట్ టెంపర్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా అంటూ నవ్వించి ప్రేరణ. ‘‘నీ గేమ్ స్ట్రాటజీ నువ్వు టీమ్ మీద తోస్తున్నావని అనిపించింది. మీ మాటకు మేము మర్యాద ఇచ్చాము కానీ మేము గేమ్‌లో ఉన్నది మీరు అసలు గుర్తించలేదు’’ అంటూ మెహబూబ్‌ను నామినేట్ చేసింది హరితేజ.

Also Read: ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న గౌతమ్.. ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ పక్కా

Advertisement

అది చెప్పండి

‘‘మెహబూబ్‌ను నామినేట్ చేయాలని పాయింట్స్ వెతుకుతున్నారా? పాయింట్స్ ఉన్నాయని మెహబూబ్‌కు నామినేషన్ వేస్తున్నారా?’’ అని సీరియస్ అయ్యాడు మెహబూబ్. ఆ తర్వాత ప్రేరణకు మరో నామినేషన్ వేసింది హరితేజ. తను గతవారం నామినేషన్స్‌లో అలా ఎందుకు చేసిందో వివరించింది. ‘‘ఎనిమిది మందిలో తేజకే తక్కువ పాయింట్స్ ఉన్నాయని నేను బ్యాలెన్స్ చేయాలనుకున్నాను’’ అని ప్రేరణ చెప్తుండగానే.. ‘‘అక్కడ బ్యాలెన్స్ చేస్తే ఎవరికి ప్రయోజనం’’ అని అడిగింది హరితేజ. నా ఇష్టం అని ప్రేరణ అనగానే.. అది చెప్పండి అంటూ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యింది హరితేజ. ‘‘ముందు నామినేషన్స్ చేసేసి మీకు కారణాలు చెప్పాలా’’ అని ప్రేరణ కూడా అలాగే రియాక్ట్ అయ్యింది.

అప్పుడు ఒకలాగా.. ఇప్పుడు ఒకలాగా

‘‘కొంపలు మునిగిపోయిన తర్వాత రావడం మానేయండి’’ అని సలహా ఇచ్చింది హరితేజ. ప్రేరణ మళ్లీ నా ఇష్టం అనగా మళ్లీ అది చెప్పండి అంది హరితేజ. ‘‘నిన్నటిదాని గురించి నేను మాట్లాడలేదు. మీకు మండింది మీరు నామినేషన్ వేస్తున్నారు వేసుకొండి’’ అని సీరియస్ అయ్యింది ప్రేరణ. ‘‘ఇక్కడ అందరూ మండే వేస్తున్నారు’’ అని కూల్‌గా సమాధానమిచ్చింది హరితేజ. నయని పావని వచ్చి మెహబూబ్‌ను నామినేట్ చేస్తూ.. ‘‘మీరు గేమ్‌లో ఉన్నంతవరకు ఒకలాగా ఉంటుంది లేకపోతే ఒకలాగా ఉంటుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు’’ అని కారణం చెప్పింది. హరితేజ.. మెహబూబ్‌ను నామినేట్ చేయగానే తను అందరితో కావాలనే మంచిగా ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు మెహబూబ్.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×