BigTV English

Bigg Boss 8 Telugu: సీజన్‌లో మరో రెడ్ కార్డ్.. నాగ్ నుంచి మరో సంచలన నిర్ణయం.?

Bigg Boss 8 Telugu: సీజన్‌లో మరో రెడ్ కార్డ్.. నాగ్ నుంచి మరో సంచలన నిర్ణయం.?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టే ముందే సెలబ్రిటీలకు కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్‌ను కచ్చితంగా ఫాలో అయినవారు మాత్రమే హౌస్‌లో ఉండగలరు. లేదంటే ఏ మాత్రం ఆలోచించకుండా బయటికి వెళ్లిపోవాల్సిందే. చాలావరకు బిగ్ బాస్‌లో కులాల గురించి, మతాల గురించి పెద్దగా డిస్కషన్స్ రాలేవు. లేదా ఒకవేళ అవి వచ్చినా ప్రేక్షకులకు చూపించలేదేమో అనే అనుమానం కూడా ఉంది. కానీ మొదటిసారి బిగ్ బాస్ 8లో ఓపెన్‌గా కమ్యూనిటీ గురించి మెహబూబ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. కమ్యూనిటీ ఓట్ల గురించి తను మాట్లాడిన మాటలు అస్సలు కరెక్ట్ కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.


కమ్యూనిటీనే కాపాడాలి

బిగ్ బాస్ 8లో ముందుగా కంటెస్టెంట్‌గా వచ్చిన నబీల్.. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన మెహబూబ్.. ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందినవారు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు మాత్రం వారిని ఆ యాంగిల్‌లో చూడరు. వారి గేమ్ నచ్చితే కేవలం దాని ఆధారంగానే వారికి ఓట్లు పడతాయి. కానీ మెహబూబ్ మనసులో వేరే ఆలోచన ఉంది. తాజాగా నబీల్‌తో మాట్లాడుతూ.. ‘‘మనకు కమ్యూనిటీ ఓట్లు పడతాయి’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ ఇద్దరం ఒకేసారి నామినేషన్స్‌లో ఉండే కమ్యూనిటీ ఓట్లు చీలిపోతాయని కూడా అన్నాడు. ఈ మాట చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. అంటే కమ్యూనిటీ, క్యాస్ట్ చూసి ఓట్లు వేసే వారిలాగా కనిపిస్తున్నామా అంటూ మెహబూబ్‌ను ఓ రేంజ్‌లో తిడుతున్నారు.


Also Read: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

నాగార్జుననే చెప్పాలి

మెహబూబ్, నబీల్‌కు మధ్య జరిగిన డిస్కషన్ ఈవారమే జరిగింది. పైగా మెహబూబ్ ఇలాంటి మాటలు అన్నాడనే విషయం కూడా ఇతర కంటెస్టెంట్స్‌కు తెలియదు. కానీ ఈ విషయం నాగార్జున వరకు తప్పకుండా వెళ్తుందని, కమ్యూనిటీ గురించి మాట్లాడినందుకు నాగార్జున.. మెహబూబ్‌కు రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ నుండి బయటికి పంపించేస్తారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 8లో ఒక కంటెస్టెంట్‌కు రెడ్ కార్డ్ చూపించారు నాగార్జున. అదే అభయ్ నవీన్. హౌస్‌లో ఉంటూనే బిగ్ బాస్ గురించి, షో మేకర్స్ గురించి తక్కువ చేసి మాట్లాడడంతో నాగార్జునకు కోపం వచ్చి రెడ్ కార్డ్ చూపించారు. ఆ తర్వాత రోజే తనను ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు కూడా.

అప్పటి కాంట్రవర్సీ

బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చాడు మెహబూబ్. ఇక ఈ షో వల్ల తన రేంజ్ మారిపోయింది. అయితే ఆ సీజన్‌లో కూడా తన చుట్టూ ఒక కాంట్రవర్సీ తిరిగింది. అప్పటి సీజన్‌లో సగం వరకు ఉండి, తర్వాత ప్రేక్షకుల దగ్గర నుండి ఓట్లు తక్కువ రావడంతో బయటికి వెళ్లిపోయాడు. ఫ్యామిలీ వీక్‌లో సోహెల్‌ను కలవడానికి వచ్చి తనకు 3వ ప్లేస్ కన్ఫర్మ్ అని చేతితో సైగలు చేసి చూపించాడు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి కమ్యూనిటీ గురించి మాట్లాడి మరో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. దీంతో మెహబూబ్‌కు తన కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుందనే పొగరు బాగా ఉంది అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కొందరు ప్రేక్షకులు.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×