BigTV English

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ 9లో అలేఖ్య చిట్టితో పాటు హీరో కూడా… ఫుల్ లిస్ట్ ఇదే!

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ 9లో అలేఖ్య చిట్టితో పాటు హీరో కూడా… ఫుల్ లిస్ట్ ఇదే!

Bigg Boss 9 Contestants..తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg boss).. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.ఇప్పుడు 9వ సీజన్ కి కూడా సర్వం సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి ఈ షోని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే అటు కంటెస్టెంట్స్ విషయంలో కూడా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఈసారి ఎలాంటి టాస్క్ లు ఇవ్వాలి.. ? ఎవరెవరిని కంటెస్టెంట్లుగా ఆహ్వానించాలి..? ప్రైజ్ మనీ ఎంత? ఇలా తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాదు హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈసారి కూడా భారీ రెమ్యూనరేషన్ తో హోస్ట్ గా చేయబోతున్నారు


అలేఖ్య చిట్టి తో పాటు యంగ్ హీరో కూడా..

ఇకపోతే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అలేఖ్య చిట్టి (Alekhya Chitti) తో పాటు ఒక యంగ్ హీరో కూడా రంగంలోకి దిగబోతున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఎలా ఉంది..? ఎవరెవరు లిస్టులో చేరారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


బిగ్ బాస్ తెలుగు 9 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్..

ఒకవైపు బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ ప్రారంభానికి సన్నహాలు జరుగుతూ ఉండగా.. మరొకవైపు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈసారి కూడా ముందుగానే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు లీక్ అవ్వడం గమనార్హం. అలా లీకైన వారి లో ప్రముఖ సీరియల్ నటి, బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి భార్య తేజస్విని (Tejaswini), ఇటీవల బర్తడే పార్టీ పేరిట పోలీస్ కేసు ఎదుర్కొన్న ప్రముఖ నటి కల్పికా గణేష్(Kalpika Ganesh), అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో సంచలనం సృష్టించిన అలేఖ్య చిట్టి, నవ్య స్వామి(Navya Swamy), జ్యోతి రాయ్(Jyoti Rai), ఛత్రపతి శేఖర్ (Chatrapati Sekhar), ముఖేష్ గౌడ(Mukhesh Gowda), యంగ్ హీరో సుమంత్ అశ్విన్(Sumanth Ashwin), సీనియర్ నటుడు సాయికిరణ్ (Sai Kiran)తో పాటూ యూట్యూబర్ శ్రావణి వర్మ(Sravani Varma), ఆర్జె రాజ్ (RJ Raj)ల పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అంతేకాదు వీరే ఫైనల్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించే వరకు ఫైనల్ లిస్టు పై ఒక నిర్ధారణకు రాలేమని చెప్పవచ్చు.

ALSO READ: Big TV Kissik Talks: అందరు ఉన్నా ఒంటరివాడినే.. దిక్కే లేదంటూ నిఖిల్ ఎమోషనల్!

బిగ్ బాస్ 9 ప్రారంభం అప్పటి నుండే..

ఇకపోతే ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో మరొకవైపు ఎప్పటినుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×