B-2 Stealth Bombers: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రంగ ప్రవేశం చేసింది. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఏకంగా B-2 స్టెల్త్ బాంబర్లతో విరుచుకుపడింది. గంటల తరబడి వరుసగా బాంబులను ప్రయోగడంతో రెండు న్యూక్లియర్ సైట్లు డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. ఇంతకీ B-2 స్టెల్త్ బాంబర్లు అంటే ఏమిటి?
ప్రపంచంలో వీటిని ఎందుకు పవర్‌ఫుల్‌గా భావిస్తారు? వీటి ధాటికి శత్రువులు తోక ముడచాల్సిందేనా? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఇరాన్‌తో యుద్ధానికి దిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ఒక మాట చెప్పారు. తాము ఎన్ని క్షిపణులు ప్రయోగించినా, ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలకు ఎలాంటి ముప్పు ఉండదని, అమెరికా దగ్గరున్న బాంబర్లు దిగితే ఫలితం ఉంటుందని ముందుగానే చెప్పారు.
ఆయన అన్నట్లుగా తన అమ్ముల పొదలోని కీలక అస్త్రాన్ని B-2 స్టెల్త్ బాంబర్ రంగంలోకి దింపింది అమెరికా. ఇరాన్ భూగర్భంలోని ఉన్న మూడు స్థావరాలను గుర్తించింది ఇజ్రాయెల్ వైమానిక దళం. వాటి ఆధారంగా ఆ మూడు స్థావరాలపై B-2 స్టెల్త్ బాంబర్ విరుచుకుపడింది అమెరికా. శనివారం రాత్రి ఆదివారం ఉదయం వరకు ఈ ఆపరేషన్ చేపట్టింది.
అందులో రెండు సైట్లు డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఇరాన్ నిర్మించిన ఆ మూడు న్యూక్లియర్ స్థావరాల్లో ఒకదానిని రష్యా నిర్మించింది. ఆ మూడు స్థావరాలు భూగర్భం లోపల ఉండడమే దీనికి కారణం. B-2 స్టెల్త్ బాంబర్ అమెరికా వైమానిక దళానికి ఇదొక బ్యాక్ బోన్ లాంటింది. ఆదేశ ఆయుధశాలలో అత్యంత అధునాతనమైన, రహస్య ఆయుధాలలో ఇదొకటి.
ALSO READ: ఐలాండ్ లో 500 మంది మాత్రమే, బిడ్డ పుడితే బలిదానమే
మూడు దశాబ్దాల కిందట స్టెల్త్ టెక్నాలజీతో రెడీ చేసింది. 1989లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దానికి మార్పులు చేసి కాసింత టెన్నాలజీని జోడించారు. ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్‌క్రాఫ్ట్ లేదా జెట్. అధునాతన శత్రు రక్షణ వ్యవస్థలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. గగనతలం నుంచి భూమిలోపల లోతుగా బాంబులు జారవిడిచేందుకు రూపొందించారు.
సోవియట్ యూనియన్ పతనం తర్వాత కేవలం 21 మాత్రమే రెడీ చేసింది. ఒక్కో దాని ధర $2.1 బిలియన్లు. ఇద్దరు పైలట్లు ఉంటారు. మనుషుల పని భారం తగ్గించేందుకు రెడీ చేసింది. ఇంజనీరింగ్ టెక్నాలజీ కారణంగా రాడార్ వ్యవస్థ వీటిని గుర్తించడం కష్టమనే చెప్పాలి.
ఎగిరే-వింగ్ డిజైన్, రాడార్-శోషక పదార్థాలు, ఇన్ఫ్రారెడ్ సంతకం ఫలితంగా 0.001 చదరపు మీటర్ల రాడార్ క్రాస్-సెక్షన్ ఏర్పడుతుంది. అధునాతన జెట్ విమానం ఇంధనం నింపకుండానే 6,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలవు. భారీ ఆయుధ సామాగ్రిని ఎత్తైన ప్రదేశాల నుంచి జారవిడుస్తుంది. మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబు-MOPను మోసుకెళ్లగల ఏకైక అమెరికా ఫైటర్ జెట్ B-2.
ఇరాన్ భూగర్భంలోని మూడు న్యూక్లియర్ సైట్లను డ్యామేజ్ చేయడానికి బీ-2 బాంబర్లను ప్రయోగించింది అమెరికా. ఒక్కో బాంబు బరువు 30 వేల పౌండ్ల బాంబును ఉపయోగిస్తుంది. ఫోర్డోని లక్ష్యంగా చేసుకోవడానికి ఆ తరహా ఆరు బాంబులు ప్రయోగించిందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ప్రతి బీ-2 బాంబర్ అలాంటి రెండు బాంబులను మోసుకెళ్ల గల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
బీ-2 నుంచి ప్రయోగించే మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్-MOP అనేది భూమిలోపలికి చొచ్చుకుపోయే అతి పెద్ద బాంబు అని అమెరికా వైమానిక దళం ఒకానొక సందర్భంలో తెలిపింది. బాంబులకు ఇది తల్లి వంటిదని నిపుణుల మాట. భూమిపై పడిన మరుక్షణం ఉపరితలం నుంచి 200 అడుగుల వరకు చొచ్చుకెళ్లగలవు.
60 అడుగుల మందంతో నిర్మించిన రీ-ఎన్ ఫోర్స్డ్ కాంక్రీట్ అయినా చీల్చుకుని దూసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం. ఇరాన్‌లోని ఫోర్డో న్యూక్లియర్ స్థావరాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో జీబీయూ- 57 బాంబులను అమెరికా ప్రయోగించింది. ఇరాన్‌లోని కోమ్ సిటీకి సమీపంలో ఎత్తయిన పర్వతంపై ఫోర్డో న్యూక్లియర్ స్థావరాన్ని నిర్మించింది.
GBU (Guided Bomb Unit) is a guided bomb designed to hit targets with precision. They provide high accuracy of impact, which reduces the likelihood of collateral damage. There are different models of GBU, differing in weight and guidance method.#GBU57 #B2 #IranIsraelConflict pic.twitter.com/imvR4xprNY
— Elvira Usubaly🇯🇵🇹🇼🇰🇷🇺🇦 (@elvira62859) June 17, 2025