Big TV Kissik Talks..బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమం ఏ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యూట్యూబ్ ఫాలో అయ్యే వారికి ఈ షో ఎంత ఫేవరెట్ అందరికీ తెలిసిందే. ప్రముఖ జబర్దస్త్ (Jabardast) కమెడియన్ వర్ష (Varsha ) హోస్టుగా వ్యవహరిస్తూ.. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ షోకి వచ్చే సెలబ్రిటీలను తన మాటలతో నవ్వించడమే కాదు.. ఎన్నో తెలియని విషయాలను కూడా బయటకు రప్పిస్తూ అభిమానులలో ఒక మంచి ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి సంబంధించి 14వ ఎపిసోడ్ పూర్తవగా.. ప్రస్తుతం నిర్వహకులు ఎపిసోడ్ ను విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈసారి గెస్ట్ గా ఎవరొచ్చారు అనే విషయానికి వస్తే.. ప్రముఖ సీరియల్ యాక్టర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal) గెస్ట్ గా విచ్చేశారు.
అందరూ ఉన్నా ఒంటరి వాడినే – నిఖిల్
అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకున్న ఈయన.. తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు అందరూ ఉన్నా.. ఒకానొక సమయంలో నా అనే వారు ఎవరూ లేక మరింత ఇబ్బందిపడ్డాను అని, దిక్కులేని వాడినయ్యాను అంటూ చెప్పి కంటతడి పెట్టుకున్నారు నిఖిల్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చెప్పుకోలేని బాధను కెమెరా ముందు చూపించాను – నిఖిల్
యాక్టింగ్ అంటే ఎందుకు ఇష్టం అని వర్ష అడగగా.. “నిజానికి చిన్నప్పుడే నేను డాన్సర్ అవ్వాలనుకున్నాను. కానీ నాన్న ఫ్రెండ్ ఒకరు నన్ను హీరోగా చూడాలి అని.. నా చదువు పూర్తయిన తర్వాత కోరడంతో కాదనలేక అలా నటన రంగంలోకి వచ్చాను. కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంతలా అంటే నేను నిజ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను మనుషులతో చెప్పుకోలేక ఒక్కసారిగా కెమెరా ముందు ఓపెన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బయటకి చెప్పలేని ఎమోషన్స్ ను కూడా కెమెరా ముందు చేసినప్పుడు చాలా బాగా యాక్ట్ చేశారు అని కూడా అని అంటారు. కానీ అక్కడ నా ఎమోషన్స్ ని నిజంగానే చూపించి ఉంటాను.
అడిగే దిక్కులేదు – నిఖిల్
మా నాన్న, మా అన్న, తమ్ముడు ఎవరైనా సరే ఎలా ఉంది ఈరోజు? ఎలా జరిగింది ఈ రోజు? నీకు ఓకేనా? నీతో అవుతుందా? అని అలా అడిగే వాళ్ళు ఎవరూ కూడా ఎక్కువమంది లేరు” అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు నిఖిల్. ఇక తర్వాత నిఖిల్ మాట్లాడుతూ..”కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నారు”అంటూ తెలిపారు.
ALSO READ: Sree Leela: హీరోయిన్ శ్రీలీలపై క్రిమినల్ కేస్ ఫైల్.. ఇంత కథ జరిగిందా?
అదే అమ్మాయికి, అబ్బాయికి తేడా?
అంతేకాదు అబ్బాయి ఏడిస్తే వాడు సింపథీ కోసం ఏడుస్తున్నాడు అంటారు..అదే అమ్మాయి ఏడిస్తే అయ్యో పాపం వాడేం చేశాడో అని అంటారు. ఇక్కడే అబ్బాయికి, అమ్మాయికి తేడా కనబడుతుంది అంటూ తన జీవితంలో తనకు జరిగిన బాధలను చెప్పుకొని.. అప్పుడప్పుడు ఆ బాధను ఇలా కెమెరా ముందు చూపిస్తున్నాను అంటూ ఓపెన్ అయిపోయారు నిఖిల్. ఇక నిఖిల్ మనసులో ఉన్న బాధను చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.