BigTV English

Bigg Boss Telugu 8 : మిడ్ వీక్ ఎలిమినేషన్.. వారిపైనే దెబ్బ..!

Bigg Boss Telugu 8 : మిడ్ వీక్ ఎలిమినేషన్.. వారిపైనే దెబ్బ..!

Bigg Boss Telugu : ఇన్ఫినిటీ లిమిట్ లెస్ అంటూ సీజన్ 8 ప్రారంభించగా.. ఈసారి టాస్క్ లు కూడా చాలా కొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ తో పాటు ఇటు ఆడియన్స్ కి కూడా మంచి వినోదాన్ని పంచుతోంది. ఇకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో 4 వారాలు పూర్తి చేసుకోగా.. నాల్గవ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. 4 వారాలలో భాగంగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదవ వారం నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఎవరికివారు తమ ఆట తీరుతో , మాటతీరుతో ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.


ఆడియన్స్ కాదు హౌస్ మేట్సే వద్దనుకున్నారు..

యధావిధిగా నామినేషన్ లో వాడి వేడి రచ్చతో పాటు గత వారం క్లాన్స్ మధ్య పోటీగా నిర్వహించిన డిఫరెంట్ బెలూన్ కాంటెస్ట్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఒక నామినేషన్స్ లో తప్ప మిగతా రోజులంతా కూడా కంటెస్టెంట్లు ఆనందంగానే కనిపించారు. అయితే వారు ఆనందంగా ఉండడం చూసి బిగ్ బాస్ తట్టుకోలేకపోయారో ఏమో.. ఈ పోటీకి ముందే వైల్డ్ కార్డు ఎంట్రీస్ అని బాంబు పేల్చి ఆశ్చర్యపరిచాడు. ఇంకేముంది ఒక పక్క తమను తాము కాపాడుకుంటూ.. మరొక పక్క వైల్డ్ కార్డ్స్ ని హౌస్ లోకి రానివ్వకుండా బిగ్ బాస్ పెట్టే ఆటల కోసం ప్రాణం పెట్టి మరి కంప్లీట్ చేశారు.. ఇదంతా ఒక ఎత్తైతే లాస్ట్ వారం సోనియా ఎలిమినేట్ అయింది. నిజం చెప్పాలంటే ఈమెను ఆడియన్స్ ఎలిమినేట్ చేయలేదు కానీ హౌస్ మేట్స్ సోనియాని వద్దనుకోవడం ఆశ్చర్యకరం. ఈ విషయం ఎలిమినేట్ అయిన తర్వాత సోనియా నాగార్జునతో బాహాటంగానే అందరి ముందు చెప్పేసింది.


ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిల ఏడుపు..

ఇకపోతే సోనియా ఎలిమినేట్ అవ్వగానే బోరున ఏడ్చేసాడు హౌస్ లో బలవంతుడైన నిఖిల్. ఇతడితోపాటు పృథ్వీ కూడా అదే తీరుతో కనిపించడం ఆశ్చర్యకరం.. చివరికి ఒక అమ్మాయి కోసం ఇద్దరు మగాళ్లు ఏడవడం చూసి ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి .మొత్తానికైతే ఈ వారం చివర్లో నాగార్జున ప్రేక్షకులకు ఒక ఝలక్ ఇచ్చి ముగించాడు.

మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ షాక్..

అంతేకాదు వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందని షాక్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న వాళ్ళ నుంచి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ పేరిట ఇంకొంతమందిని హౌస్ లోకి పంపించి, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పుకొచ్చారు మొత్తానికి అయితే కంటెస్టెంట్లలో ఒకరు ఈ వారం బలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..మరి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బుధవారం లేదా గురువారం ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. అయితే అదే సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ వస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇటు ఆడియన్స్ లోనే కాదు అటు కంటెస్టెంట్స్ లో కూడా ఆసక్తికరంగా మారింది.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×