Rana Daggubati : రానా దగ్గుబాటి నుంచి చాలాకాలం నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం దగ్గుబాటి అభిమానులను నిరాశ పరుస్తోంది. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియాపై కన్నేస్తే, అప్పుడెప్పుడో ‘బాహుబలి’ మూవీ తోనే పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తో పాటు ఎదిగిన రానా అదే జోష్నో కంటిన్యూ చేయలేకపోయారు. హిందీలో చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. దీంతో కొన్ని రోజుల ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాడని టాక్ వినిపించినప్పటికీ ఇప్పటిదాకా ఆయన నటించిన సినిమాలు ఏమీ థియేటర్లలోకి రాకపోవడం దగ్గుబాటి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది. తన అభిమానుల కోసమే అన్నట్టుగా రానా ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండడంతో పాటు పలు మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ హీరో దెయ్యంగా మారబోతున్నాడని టాక్ నడుస్తోంది? మరి రానా దెయ్యం పాత్ర చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
దెయ్యం మారబోతున్న రానా
రానా దగ్గుబాటి ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఫాంటసీ, పొలిటికల్ డ్రామాలు, కామెడీ వంటి జానర్లను టచ్ చేశారు. కానీ గతంలో ఆయన కెరీర్లో చేయని ఒక కొత్త జానర్ లో కొత్త ప్రయాణాన్ని రానా ప్రారంభించబోతున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఇదివరకు ఎన్నడూ చేయని విధంగా రానా ఒక హారర్ థ్రిల్లర్ చేయబోతున్నాడని తెలుస్తోంది. బాహుబలి నిర్మాతలే ఈ సినిమాను నిర్మించబోతున్నారని, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రానా దెయ్యం మారబోతున్నాడని టాక్ నడుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఇంకా వెళ్లడి కాలేదు. అయినప్పటికీ రానా నటుడిగా ఇప్పటిదాకా తాను చేసిన సినిమాలన్నీ పక్కనపెట్టి ఇప్పుడు ఈ విలక్షణమైన పాత్రను ఎలా పోషించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
సాధారణంగా హారర్ సినిమాలంటే జనాలకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పటిదాకా చాలామంది స్టార్ హీరోలు ఈ జానర్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా. ఇక్కడ చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పలువురు స్టార్ హీరోలు హారర్ థ్రిల్లర్ సినిమాల్లో నటించినప్పటికీ దెయ్యంగా మాత్రం మారే సాహసం చేయలేదు. మరి ప్రేక్షకులు ఒప్పుకుంటారా లేదా అనే డౌటా? లేదంటే దెయ్యం అంటే డిఫరెంట్ మేకప్ ఉంటుంది, హీరోఇజం ఎలివేట్ అవ్వదు అనే అంశమో తెలీదు గానీ దెయ్యంగా మారడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తాజాగా రానా మొట్ట మొదటిసారి దెయ్యం పాత్రను పోషించబడుతున్నాడనే వార్త ఆయన అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రానా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 35 చిన్న కథ కాదు అనే సినిమాతో నిర్మాతగా మారాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హై బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘వెట్టాయన్’ లో కీలకపాత్రను పోషిస్తున్నారు. మరోవైపు ‘రానా నాయుడు’ సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. వీటితో పాటే దుల్కర్ సల్మాన్ తో కలిసి ‘కాంత’ అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు.