Bigg Boss Priyanka Singh : బుల్లితెర టాప్ కామెడీ షో జబర్దస్త్ షో ద్వారా చాలా మంది వెండి తెర పై ఆఫర్స్ అందుకున్నారు. కొందరు సినిమాల్లో హీరోలు అయితే మరికొంతమంది డైరెక్టర్స్, నిర్మాతలు అయ్యారు. ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచమైన ప్రియాంక సింగ్ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.. గతంలో బిగ్ బాస్ లో సందడి చేసింది. సీరియల్ హీరో మానస్ తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదు. ఇక ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.. ఆ మూవీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ ఇన్నాళ్లకు తన కలను నేరవేర్చుకోబోతుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగు కామెడీ మూవీ చేయబోతున్నది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ గా మారుతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రియాంక సింగ్ తో పాటుగా ఆదర్శ్ , అశ్రీత్, పూజిత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మేకర్స్ భావిస్తున్నారు..
జబర్దస్త్ లో లేడి గెటప్ లు వేసుకుంటూ పాపులారీటిని సొంతం చేసుకున్నారు ప్రియాంక సింగ్.. ఆ తర్వాత కంప్లిట్ గా అమ్మాయిగా మారింది. ఆ తర్వాత అందరికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో తన ఆట పాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత సినిమాల్లో లేదా జబర్దస్త్ లోనో కనిపిస్తుందేమో అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో, టీవీ లో పండగల ఈవెంట్స్ లలో మెరుస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇన్నాళ్లకు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.. విశ్వనాథ్ మొదటిసారి డైరెక్షన్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కిస్తోన్నాడు సొసైటీలోని లింగ బేధాలను వినోదాత్మక పంథాలో ఈ మూవీని తీసుకున్నారు. కామెడీ తో పాటు నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు.. ఈ మూవీ డిఫెనేట్ గా అందరికి నచ్చుతుందని ప్రియాంక సింగ్ అంటున్నారు.
ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ పూర్తి అయ్యిందని అంటున్నారు. టాకీ పార్ట్ పూర్తి కావొస్తుందని సమాచారం. టెక్నాలజీ, ఎమోషన్స్ లింగ సమానత్వం అంశాలను టచ్ చేస్తూ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర డైరెక్టర్ ఘంటసాల విశ్వనాథ్ అన్నాడు. వేణుబాబు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తున్నారు. దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.. త్వరలోనే మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం..