Bigg Boss 9 : బిగ్బాస్ సీజన్ 9 రెండవ వారం కూడా కంప్లీట్ అయిపోతుంది. మొదట వారం అయిన వెంటనే చాలామంది వ్యక్తిత్వాలు బయటపడ్డాయి. ఇక రెండోవారం విషయానికి వస్తే ఈ వారంలో కూడా చాలా హైలెట్స్ జరిగాయి. ఈ వారం రోజుల్లో హౌస్ మేట్స్ ఆడిన గేమ్ గురించి నాగార్జున ఈరోజు మాట్లాడనున్నారు.
ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అని చాలామంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మొదటి వారం అయిన వెంటనే పెద్దగా గేమ్ ఆడక పోవడం వలన, అలానే బయట నుండి కూడా కొంత ప్రెజర్ రావడం వలన శ్రేష్ఠి వర్మ ను ఎలిమినేట్ చేశారు.
ఇక రెండవ వారానికి వస్తే మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తుంది. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోతాడు అని కొంతమంది ముందే ఊహించరు. అలానే బిగ్ బాస్ ప్లాన్ కూడా అదుర్స్ అని చెప్పాలి. మొదటి వారంలో సెలబ్రిటీస్ గ్రూప్ నుండి ఒకరు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు కామనర్స్ నుండి ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పుడు కామనర్స్ మరియు సెలబ్రిటీస్ మధ్య లెక్క సరిగ్గా సరిపోయిందని చెప్పాలి.
మర్యాద మనీష్ సంచాలక్ గా మొదటి వారంలో ఒక టాస్క్ దగ్గర ఫెయిల్ అయ్యారు. అలానే ఆ విషయంలో తనది తప్పు ఉన్నట్లు ఇమ్మానుయేల్ దగ్గర కూడా ఒప్పుకున్నాడు. అందుకనే ఇమ్మానుయేల్ మర్యాద మనీష్ ను నామినేట్ చేశాడు. అయితే మర్యాద మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాల్లో ఓట్లు తక్కువ రావడమే ముఖ్య కారణమని తెలుస్తుంది. చాలామంది బిగ్ బాస్ చూసే వీక్షకులకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరు ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అని ఈజీగా అర్థమవుతుంది.
Also Read: OG Movie Team: ఓజీ నిర్మాతలకు బజ్ బాధలు, ఇక ఆపేయండి ఎక్కువ చేసిన ప్రమాదమే