Fake doctors: సమాజంలో రోజు రోజుకీ నకిలీ డాక్టర్ల సంఖ్య పెరిగిపోతుంది. డాక్టర్ అనే పేరుతో జనాల వద్ద వేలు, లక్షల రూపాయల డబ్బులు దోచుకుంటున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా ఇష్టమొచ్చినట్టు డబ్బులు దండుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో అయితే ఈ నకిలీ వైద్యుల సంఖ్య ఇంకొంత ఎక్కువగానే ఉంటుంది. తాజాగా నగరంలోని నాగారం ఏరియాలో ఓ నకలీ డాక్టర్ క్లీనిక్ పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు నిర్వహించారు. నకలీ వైద్యుని నుంచి రూ.50వేల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని మహేశ్వరం, నాగారం ప్రాంతంలో చెన్న తిరుపతి అనే వ్యక్తి క్లీనిక్ నడుపుతున్నాడు. అయితే.. ఇతను ఎలాంటి స్టడీ సర్టిఫికెట్స్ లేకుండా క్లీనిక్, మందుల షాపును కొనసాగిస్తున్నారు. అతనికి తెలిసిన అంతంతమాత్రం వైద్యంతో పేషంట్స్ ను చూస్తున్నాడు. ఎలాంటి అర్హత లేకుండా క్లీనిక్, మెడికల్ షాపు నడుపుతున్నాడని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులకు సమాచారం అందింది. దీంతో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ పి. శ్రావంతి రెడ్డి నేతృత్వంలో అధికారులు దాడులకు దిగారు. అధికారులు క్లీనిక్ వద్దకు వెళ్లి ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేని 23 రకాల మెడిసిన్స్.. యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఫిజీషియన్ సాంపుల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ 23 రకాల మెడిసిన్స్ విలువ మొత్తం రూ.50వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మోసపూరితంగా క్లీనిక్ నిర్వహిస్తూ.. రోగులను మోసం చేయడమే కాకుండా.. అంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ వంటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నాడని అధికారులు హెచ్చరించారు. ఈ రైడ్, కేవలం ఒక క్లీనిక్‌పైనే పరిమితం కాదు. హైదరాబాద్ నగరం మొత్తంలో వ్యాపించిన నకిలీ వైద్యుల నెట్‌వర్క్ లకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.
ALSO READ: Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !
రోగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. అర్హత లేని వారి నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తే.. జీవితాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. డ్రగ్ లైసెన్స్ లేని మెడిసిన్ అమ్మకాలు, స్టెరాయిడ్స్, ఫ్లూయిడ్స్ వంటి మందులు, మానవ శరీరాన్ని విషపు బాంబుల్లా మార్చేస్తాయి. డీసీఏ అధికారులు, ఈ కేసులో మరిన్ని దర్యాప్తులు చేస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ALSO READ: Cyber Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్
సమాజంలో ఈ ఘటన, ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనా ప్రచారానికి కారణమవుతోంది. ప్రజలు, అర్హత ధృవీకరణ చేసుకుని, లైసెన్స్‌తోనే వైద్య సేవలు పొందాలని, ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. నకిలీ వైద్యులపై ఈ దాడులు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. ఆరోగ్యం అనేది మన చేతిలోనే, మన జాగ్రత్తలే దాని కవచమని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తోంది.