E-Paper
Advertisement

BB Telugu 8: ముగిసిన ఓటింగ్..నరాలు తెగే ఉత్కంఠ.. నిఖిల్, గౌతమ్ కి కూడా షాక్..!

BB Telugu 8: ముగిసిన ఓటింగ్..నరాలు తెగే ఉత్కంఠ.. నిఖిల్, గౌతమ్ కి కూడా షాక్..!
Advertisement

BB Telugu 8.. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu 8)చివరి ఘట్టానికి చేరుకుంది. ఇక ఎవరు గెలవబోతున్నారు? అనే ఉత్కంఠ ఆడియన్స్ లో మరింత ఎక్కువైంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయం ముగిసే సరికి టైటిల్ విన్నర్ ఎవరో కాస్త లీక్ అయిపోతుంది. ఈ శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఈ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరగబోతుందని, ఇప్పటికే షూటింగ్లో పాల్గొనడానికి పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ ఊర్ల నుండి హైదరాబాద్ కి వచ్చేసినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే నిన్న అర్ధరాత్రి 12 గంటలకు టైటిల్ విన్నర్ ఓటింగ్ కాస్త ముగిసింది. అటు అభిమానులలో కూడా నరాలు తెగేంత ఉత్కంఠ రేకెత్తుతోంది. సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే నిఖిల్ యూట్యూబ్ లో ఎవరికి అందనంత రేంజ్ లో నిలిచాడు. మొదటి స్థానంలో నిఖిల్ కొనసాగుతూ ఉండగా రెండవ స్థానంలో గౌతమ్ , మూడవ స్థానంలో ప్రేరణ, నాలుగవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నారు. ఇక అవినాష్ ప్రైజ్ మనీ తో ఈ వారం వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇకపోతే యూట్యూబ్ పోల్స్ మాత్రమే వీరిని ఆ స్థానాలలో నిలబెట్టింది. ముఖ్యంగా నిఖిల్, గౌతమ్ కి మధ్య యూట్యూబ్ పోల్స్ కి కనీసం 50% తేడా ఉంది. ఇది మామూలు రేంజ్ లీడింగ్ కాదు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ టైటిల్ గెలవబోతున్నారని అనుకోవచ్చు.

Advertisement

అయితే ఇది యూట్యూబ్ వరకు మాత్రమే. అటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తో పాటు మిగతా వెబ్ సైట్స్ పోల్స్ చూసుకుంటే నిఖిల్ పై 50% తేడాతో గౌతమ్ లీడింగ్ లో ఉన్నారు. ఇది చూసిన గౌతమ్ అభిమానులు కూడా తమ అభిమాన కంటెస్టెంట్ విజేత కాబోతున్నాడని అనుకోవచ్చు. వెబ్సైట్స్ లో గౌతమ్ కి నిఖిల్ దరిదాపుల్లో కూడా లేడు. నిజానికి ఈ రెండూ కూడా ఫేక్ అని చెప్పాలి . ఎందుకంటే అధికారికంగా వచ్చిన ఓట్లను బట్టి చూస్తే ఈ ఇరువురు కంటెస్టెంట్స్ అభిమానులు అనుకున్నట్టుగా లేదు. నిఖిల్, గౌతమ్ మధ్య అధికారిక ఓటింగ్ నువ్వా నేనా అనే రేంజ్ లో హోరాహోరీగా జరిగింది.నిన్న ఉదయం 11 గంటలకు వచ్చిన అప్డేట్ విషయానికి వస్తే.. నిఖిల్ కంటే గౌతం కేవలం 0.03 ఓట్ల శాతం తేడాతో లీడింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా గౌతమ్ కే ఉన్నాయి. కానీ ఓటింగ్ ముగిసే సమయానికి ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే గ్రాఫ్ పెరిగింది. ఇద్దరిలో ఎవరైనా గెలవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు గౌతమ్, ఇటు నిఖిల్ ఇద్దరు కూడా ఉత్కంఠతో ఆశ్చర్యంగా ఎవరికి రాబోతుంది అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రేరణ కూడా వీరితో పోటీ పడుతుంది. కానీ విన్నర్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. మధ్యలో కొన్ని నెగిటివ్ ఎపిసోడ్ పడటం వల్లే ఆమె టైటిల్ రేస్ నుండి తప్పుకుంది.ఇక ఈ ఉత్కంఠకు బ్రేక్ పడాలి అంటే ఈరోజు రాత్రి వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×