BigTV English

IND vs Aus 3rd Test: 76 ఓవర్లు వృధా…తొలి రోజు ఆట రద్దు..!

IND vs Aus 3rd Test: 76 ఓవర్లు వృధా…తొలి రోజు ఆట రద్దు..!

IND vs Aus 3rd Test: బ్రిస్బెన్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా జట్లు 3 వ టెస్ట్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఉదయం 5:50 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ 3 వ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే వరునుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం తగ్గుముఖం పట్టడం, మళ్లీ వర్షం పడడం ఇలా {Ind Vs Aus} మూడుసార్లు జరగడంతో తొలి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. మొదటి సెషన్ లో 13.2 ఓవర్లు మాత్రమే పడ్డాయి. 13.2 ఓవర్ల లోపు ఆస్ట్రేలియా తన 1 ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది.


Also Read: World Chess Champion Gukesh: గుకేష్‌ తెలుగోడు కాదు…చంద్రబాబు వర్సెస్‌ స్టాలిన్‌ ?

క్రీజ్ లో ఉస్మాన్ ఖవాజా (19*), నాథన్ మెక్ స్వీని (4*) నాటౌట్ గా ఉన్నారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో శనివారం ఉదయం ప్రారంభమైన ఈ తొలి రోజు {Ind Vs Aus} ఆటను అంపైర్లు రద్దు చేశారు. దీంతో 76 ఓవర్లు వృధా అయ్యాయి. రెండవ రోజు భారత్ కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 5:20 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది. ఆట సజావుగా సాగితే 98 ఓవర్లు ఆడించనున్నారు. కానీ రెండవ రోజు కూడా వరునుడి ముప్పు పొంచి ఉంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తొలిరోజు {Ind Vs Aus} ఆటను ప్రత్యక్షంగా చూద్దామని వచ్చిన క్రికెట్ అభిమానులకు వరునుడికారణంగా నిరాశ ఎదురైంది.


దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వారికి శుభవార్త చెప్పింది. తొలిరోజు ఆట టికెట్ల డబ్బును రిఫండ్ చేస్తామని తెలిపింది. ఇక ఈ గబ్బా పిచ్ పై గత ఏడు టెస్టుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలవడం టీమిండియా కు కలిసివచ్చింది. రెండవ టెస్ట్ లో ఓటమిపాలైన భారత్.. మూడవ టెస్ట్ లో రెండు మార్పులు చేసింది. జట్టులో అశ్విన్ కి బదులు మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా వచ్చాడు. ఇక హర్షిత్ రాణా ను పక్కనబెట్టి ఆకాష్ దీప్ కి అవకాశం ఇచ్చింది భారత్.

Also Read: Vinod Kambli: పెన్షన్ డబ్బులతో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్!

ఇక నితీష్ రెడ్డిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ రెండు టెస్టుల్లో అతను బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను రాణించడంతో సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. అటు ఆస్ట్రేలియా సైతం 3వ టెస్ట్ లో ఓ మార్పు చేసింది. బోలాండ్ ని పక్కన పెట్టి.. హేజిల్ వుడ్ ని జట్టులోకి తీసుకుంది. ఈ గబ్బా పిచ్ పై ఇప్పటివరకు ఏడు టెస్ట్ మ్యాచ్ లు ఆడిన భారత్ ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది. ఇక ఈ టెస్ట్ లో విరాట్ – రోహిత్ ఎలా ఆడతారన్నది ఆసక్తిగా మారింది. మొదటి టెస్ట్ లో అదరగొట్టిన కోహ్లీ.. 2వ టెస్ట్ లో పెద్దగా రాణించలేకపోయాడు. మరోవైపు ఆరో స్థానంలో బ్యాటింగ్ కి దిగిన రోహిత్ నిరాశపరిచాడు. వీరిద్దరూ ఈ 3వ మ్యాచ్ లో రాణించడం భారత జట్టుకు కీలకంగా మారింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×