BigTV English

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. వారానికి ఎన్ని లక్షలో తెలుసా..?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. వారానికి ఎన్ని లక్షలో తెలుసా..?

Bigg Boss 9 Telugu : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నా షో బిగ్ బాస్.. గతంలో ఎన్నడు లేని విధంగా టాప్ రియాలిటీ షో గా ప్రేక్షకుల మనసుని దోచుకుంది. ఒకవైపు విమర్శలు ఎదురవుతున్న సరే.. మరోవైపు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ ని మొదలు పెట్టబోతున్నారు.. ఈ సందర్భంగా బిగ్ బాస్ అగ్ని పరీక్షను నిర్వహిస్తున్నారు.. ఇందులో సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ లోకి డైరెక్ట్ గా పంపిస్తారని ప్రోమోలను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు కొందరిని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపించబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? వారానికి రెమ్యూనరేషన్ ఎంత? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ 9 లో స్టార్ హీరో..

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏకైక షో బిగ్ బాస్ త్వరలోనే సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సీజన్ ని ప్రారంభించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో లాగా ఇప్పుడు కంటెస్టెంట్లను ముందుగా అనౌన్స్ చేయడం లేదు. కనీసం ఎవరు అన్నది కూడా పెద్దగా తెలియజేయడం లేదు. దాంతో ఈ షో గురించి రకరకాల పుకార్లు బయటకు వచ్చేసాయి. ఈ షో కి సెలెక్ట్ చేసేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని స్పెషల్ షో ని నిర్వహించారు. ఇందులో 40 మంది సామాన్యులను సెలెక్ట్ చేశారు. టాలెంట్ ను బట్టి అందులోంచి ఐదు మందిని సెలెక్ట్ చేయబోతున్నారంటూ ఇప్పటికే వార్తలు వైరల్ గా మారాయి. అటు సెలబ్రిటీల లిస్టు కూడా తయారు అయిపోయిందని తెలుస్తుంది. ఇందులో ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సమాచారం.


Also Read : చిరంజీవిని చంపాలని చూశారా..? బర్త్ డే వేళ బయటపడ్డ నిజం..

వారానికి 4 లక్షల రెమ్యూనరేషన్..

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కు హోస్ట్ గా నాగార్జున చెయ్యనున్నారు. ఆల్రడీ హోస్ట్ రెమ్యూనరేషన్ ను కూడా ఫిక్స్ చేశారు. సీరియల్ యాక్టర్స్ ను కొందరిని సెలెక్ట్ చేశారు. ఈ సీజన్ కోసం ఒక సినిమా సెలబ్రిటీని తీసుకోస్తున్నారట.. ఆ వ్యక్తికి వీక్ లోనే అత్యంత హైయెస్ట్ పేమెంట్ ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఒక వీక్ కి నాలుగు లక్షల వరకు అతనికి పే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ లెక్కన అతని పెర్ఫార్మన్స్ బాగుంటే మాత్రం మరి కొన్ని రోజులు హౌస్ లో కొనసాగితే అతని రెమ్యూనరేషన్ సినిమాకు మించే ఉంటుందని తెలుస్తుంది.. మరి హౌస్ లోకి స్టార్ హీరోగా ఎవరిని తీసుకుంటారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Related News

Bigg Boss 9 Telugu: 5వ వారం నామినేషన్స్ లో ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ ఉందా..?

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Bigg Boss Buzzz : వొంగోపెట్టి పుంగి బజా… మాస్క్ మ్యాన్‌కు క్లాస్ పీకిన శివాజీ..

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మాస్క్ మ్యాన్ అవుట్.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss 9 Elimination: హరీష్ అవుట్.. భరణి నిజస్వరూపం ఇదే, తనూజ అచ్చం నాలాగే.. మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss 9: సేఫ్ గేమర్స్ కి నాగార్జున షాక్.. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలు..

Bigg Boss 9 Promo: సండే.. ఫన్‌డే.. మగవాళ్లకు మాత్రమే.. ఓడిన ఓనర్స్‌ టీం, ఐస్‌ క్యూబ్స్‌తో కితకితలు!

Srija Dammu Father: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. శ్రీజ దమ్ము ట్రోల్స్‌పై తండ్రి ఎమోషనల్‌

Big Stories

×