Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో కష్టాలను అనుభవించి, అవమానాలను దిగమింగుకొని.. ఇండస్ట్రీ లోకి నటుడుగా ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్ గా పలు సినిమాల్లో నటించిన ఈయన.. తర్వాత హీరోగా సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరోలకు మెగాస్టార్ ఆదర్శమని చెప్పాలి.. నేడు ఈయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. మెగా అభిమానులు ఒక పండుగగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఈ సమయంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవిని చంపాలని ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది…
కేకులో విషం పెట్టి చంపబోయారు..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి తన గురించి.. తన సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ఈ సందర్భంగా ఇది మాట్లాడుతూ గతంలో ఆయనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. తనపై ఒక అభిమాని విషప్రయోగం చేయడం. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశాడు.. మరణమృదంగం మూవీలో షూటింగ్ సమయంలో ఓ అభిమాని బర్త్‌డే కేక్ తెచ్చి, బలవంతంగా నా నోట్లో పెట్టాడు. నాకు స్పూన్‌తోనే తినడం అలవాటు కావడంతో.. అది చేదుగా అనిపించి వెంటనే బయటకు ఊసాను.. అయితే ఈ విషయాన్ని నేను వెంటనే సెట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను.. అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు. కేరళ నుంచి తీసుకొచ్చిన వశీకరణం మందును తీసుకొచ్చి కేక్‌లో కలిపాడట. అందులో విషం ఉన్నట్లు తేలింది. అతను ఒక పిచ్చి అభిమాని.. అతనిని నేను పట్టించుకోకపోవడం వల్లే అతని ఇలా చేశాడని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత అతన్ని క్షమించి వదిలేసాను అని మెగాస్టార్ అన్నారు.. మెగాస్టార్ ది ఎంత జాలి హృదయం అంటూ ఈ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: వివాదంలో జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో సింగర్ పై విమర్శలు..!
రియల్ హీరోగా మెగాస్టార్..
చిరంజీవి సినిమాలలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించడం మాత్రమే కాదు.. తన దగ్గరికి సాయం కోరిన వారికి తన వంతు సాయాన్ని చేస్తూ గొప్ప మనసుని చాటుకుంటాడు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని మొదలుపెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఇప్పటికీ ఇది ఒక మహత్తర కార్యంగా కొనసాగుతుంది. సినీ ఇండస్ట్రీ పెద్దగా కార్మికులకు అండగా నిలబడుతూ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు చిరంజీవి. అలాంటి చిరంజీవి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలను చేస్తున్నారు. ఇవాళ నటిస్తున్న సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. నిన్న వచ్చిన విశ్వంభరా గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..