Shanmukh Jaswanth: ఈరోజుల్లో ఎవరు ఎందుకు బ్రేకప్ చెప్పుకుంటున్నారో అసలు అర్థమే కావడం లేదు. చిన్న చిన్న కారణాలు, కోపాలు, మనస్పర్థలకే జంటలు విడిపోతున్నారు. మామూలుగా బయట సమాజంలో ఇది కామన్‌గా జరిగేదే. కానీ సెలబ్రిటీల జీవితంలో ఇలా జరిగితే మాత్రం వాటిపై ఫోకస్ పెరుగుతుంది. కొన్నాళ్ల పాటు ప్రేక్షకులంతా దాని గురించే మాట్లాడుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth), దీప్తి సునైనా (Deepthi Sunaina) బ్రేకప్ కూడా ఇలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన బ్రేకప్‌కు కారణం సిరి హన్మంత్ అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అలాంటి దీప్తి, సిరి తాజాగా ఒకే వేడుకపై కనిపించి అందరికీ షాకిచ్చారు.
ఓపెన్ సీక్రెట్
బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతీ సీజన్‌లో కొందరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంటారు. అలా బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునయన కంటెస్టెంట్‌గా వచ్చింది. తను కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడు హీరో తనీష్‌తో కాస్త క్లోజ్‌గా మూవ్ అయ్యింది. కానీ అది ఫ్రెండ్‌షిప్ వరకే పరిమితమయ్యింది కూడా. అందుకే దాని గురించి ప్రేక్షకులు పెద్దగా మాట్లాడలేదు. దీప్తి సునయన కంటెస్టెంట్‌గా వచ్చి వెళ్లిపోయిన రెండు సీజన్స్ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి సిరి హన్మంత్ (Siri Hanumanth), షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్స్‌గా కలిసి అడుగుపెట్టారు. ఆ షో షణ్ముఖ్ పర్సనల్ లైఫ్‌ను చాలా మార్చేసింది. చివరికి తన బ్రేకప్‌కు కారణం అయ్యేలా చేసింది.
వాళ్లు బాగానే ఉన్నారు
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన సిరి, షన్నూ ఫ్రెండ్స్ అని చెప్తూ శృతిమించిన ప్రవర్తనతో అందరికీ షాకిచ్చారు. వారి ప్రవర్తన చూసి ప్రేక్షకులకు సైతం చిరాకు వచ్చేది. హగ్గులు, కిస్సులు లాంటివి వీరి మధ్య కామన్ అయిపోయాయి. అది అప్పట్లో షన్నూ గర్ల్‌ఫ్రెండ్ అయిన దీప్తికి నచ్చలేదు. అందుకే తను రన్నర్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత కూడా తనను కలవడానికి రాలేదు దీప్తి. ఇక ఆ తర్వాత కొన్నిరోజులకే షన్నూకు బ్రేకప్ చెప్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆ విషయాన్ని షన్నూ జీర్ణించుకోలేకపోయాడు. కానీ సిరి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్‌తో హ్యాపీగా లైఫ్ గడిపేస్తోంది. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత దీప్తి, సిరి కలిసి ఒకే వేడుకలో కనిపించి అలరించారు.
Also Read: దారుణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ పరిస్థితి..తినడానికి తిండి లేక..
కలిసి డ్యాన్సులు
ఇటీవల సిరి, శ్రీహాన్ కలిసి వైజాగ్‌లో ఒక కొత్త బిజినెస్ ప్రారంభించారు. చాలాకాలంగా ఈ బిజినెస్ గురించి తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ బిజినెస్ స్టోర్ ప్రారంభోత్సవం కోసం పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను స్పెషల్‌గా ఆహ్వానించింది సిరి. అందులో దీప్తి కూడా ఉంది. ఇక దీప్తి, సిరి కలిసి ఈ ప్రారంభోత్సవంలో స్టేజ్‌పై స్టెప్పులు కూడా వేశారు. అది చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. షన్నూ పర్సనల్ లైఫ్‌పై దెబ్బపడేలా చేసి సిరి, దీప్తి మాత్రం ఇలా కలిసిపోయారేంటి అని షాకవుతున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నుండి వెండితెరపై హీరో అయ్యే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు.