BigTV English

Indian Students : అమెరికా వద్దు.. ఆ దేశమే ముద్దు.. విదేశీ విద్యకు నయా అడ్రస్, ఇకపై అంతా అటే…

Indian Students : అమెరికా వద్దు.. ఆ దేశమే ముద్దు.. విదేశీ విద్యకు నయా అడ్రస్, ఇకపై అంతా అటే…

France Indian Students | అమెరికాలో విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ప్రభుత్వంతో విసిగిపోయిన వారికి శుభవార్త. ఫ్రాన్స్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా, వర్క్‌ పర్మిట్లను త్వరలోనే ప్రకటించబోతోందని సమాచారం. ఇంతకుముందు బిగ్‌ ఫోర్‌గా పేరుగాంచిన అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలి నాలుగు గమ్యస్థానాలుగా ఉండేవి. అయితే ఈ ధోరణి ఇటీవలి కాలంలో మారింది. భారతీయ విద్యార్థులకు టాప్‌ చాయిస్‌గా యూరప్‌ దేశాలు.. ముఖ్యంగా ఫ్రాన్స్‌ మారింది. ఫ్రాన్స్ లోని సోర్బోన్‌ యూనివర్సిటీ, హెచ్‌ఈసీ పారిస్‌ బిజినెస్‌ స్కూల్ ఎకోల్‌ పాలిటెక్నిక్‌ వంటి 75 కి పైగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, వ్యాణిజ్యం, కళలు, సాంకేతికత, శాస్త్రాలలో అగ్రశ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు.


2023–24 విద్యా సంవత్సరంలో 7,344 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లోని విద్యాసంస్థల్లో చేరారు. 2030 నాటికి ఈ సంఖ్య 200 శాతం పెరుగుతుందని అంచనా. 2024 జనవరిలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారతీయ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. 2030 నాటికి భారత్‌ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించడమే తమ దేశ లక్ష్యమని ఆనాడు మాక్రాన్‌ తన మనసులో మాట చెప్పారు. ఇటీవల వేలాది మంది భారతీయ విద్యార్థులతో అభిప్రాయాలతో రూపొందిన క్యూఎస్‌ నివేదిక ప్రకారం, ఫ్రాన్స్‌ తమ ఇష్టమైన గమ్యస్థానమని 31 శాతం మంది భారతీయ విద్యార్థులు చెప్పడం విశేషం. భారతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది ఫ్రాన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 21 శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.

Also Read: అమెరికాలో విలవిల్లాడుతున్న భారతీయ విద్యార్థులు.. ఫీజులు, ఖర్చులకు డబ్బుల్లేవ్


ఫ్రెంచ్‌ నేర్చుకుంటే ఈజీగా
ట్రంప్‌ రాకతో మారిన అమెరికా విధానాలు, నిజ్జర్‌ ఉదంతంతో భారత్‌–కెనడా మధ్య సత్సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో, భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్‌ తన వీసా ప్రక్రియలను సరళతరం చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఫ్రెంచ్‌తోపాటు ఇంగ్లీష్‌ భాషలోనూ కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ తరగతుల ద్వారా ఫ్రెంచ్‌ బోధిస్తూ, అది పూర్తి చేసిన వారికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌కు అనుమతిస్తోంది. ఫ్రెంచ్‌ భాషలో బోధించే 200కి పైగా విద్యా కార్యక్రమాల్లో విదేశీ విద్యార్థులకు దీనివల్ల అవకాశం లభిస్తుంది. అనేక ఫ్రెంచ్‌ విశ్వవిద్యాలయాలు డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మాస్టర్స్‌ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండి, ఫ్రాన్స్‌లో ఒక సెమిస్టర్‌ చదివిన భారతీయ విద్యార్థులు ఐదేళ్ల షార్ట్‌–స్టే స్కెంజెన్‌ వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఫ్రెంచ్‌ మాస్టర్స్‌ డిగ్రీతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పోస్ట్‌–స్టడీ వర్క్‌ వీసాను కూడా ఫ్రాన్స్‌ అందిస్తుంది. ఈ వీసాను మొత్తం రెండేళ్లపాటు జారీ చేస్తారు. దీంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

ఖర్చు కూడా తక్కువే!
భారతీయ విద్యార్థులను ఫ్రెంచ్‌ విశ్వవిద్యాలయాల వైపు నడిపించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఫ్రెంచ్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయి. బిజినెస్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్‌తోపాటు విస్తృతమైన కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఇవేకాకుండా మిగతా బిగ్‌ఫోర్‌ దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య ఖర్చు చాలా తక్కువ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ ట్యూషన్‌ ఫీజులు ఉంటాయి. చార్పాక్, ఈఫిల్‌ ఎక్సలెన్స్‌ ప్రోగ్రామ్‌ వంటి అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలతో భారత విద్యార్థులు లాభం పొందవచ్చు. భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 కోట్ల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను ఫ్రాన్స్‌ అందిస్తోంది. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం కూడా తక్కువే. పారిస్‌లో నెలకు సగటున రూ.1.54 లక్షలు, లియోన్‌లో రూ.1.01 లక్షలు వంటి బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇతర నగరాల్లో సగటు జీవన వ్యయం నెలకు లక్ష రూపాయల కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాలు చాలా మంచి ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

అమెరికాలో విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తే.. వారి వీసా రద్దు చేస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడంతో.. ఇప్పుడు అక్కడ చదువుకుంటున్న భారత సహా మిగతా విదేశీ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే వారికి ఫ్రాన్స్ దేశం ఒక మంచి ప్రత్యామ్నాయం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×