E-Paper
Advertisement

Viral Video: ఇంట్లోకి వరద.. హారతి ఇచ్చి, పూజచేసి.. పుణ్య స్నానాలు చేసిన పోలీస్

Viral Video: ఇంట్లోకి వరద.. హారతి ఇచ్చి, పూజచేసి.. పుణ్య స్నానాలు చేసిన పోలీస్
Advertisement

Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల వల్ల ఇంట్లోకి ప్రవేశించిన వరదనీటిని ఒక పోలీస్ అధికారి గంగమ్మగా పూజించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రదీప్ నిషాద్ అనే పోలీస్ అధికారి ఈ వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వీడియోలో ఆయన వరద నీటిలో పాలు పోస్తూ, పూలు వేస్తూ, “జై గంగా మయ్యా కీ” అంటూ నినదిస్తూ కనిపిస్తారు.

ఈ వీడియోలో నిషాద్ పోలీస్ యూనిఫాంలో  ఉన్నారు. వరద నీటిలో ఈతకొడుతూ బయటకు వస్తున్నట్లు వీడియో కూడా ఉంది. దీనికి క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా పెట్టాడు – “ఈ ఉదయం విధులకు వెళ్లేటప్పుడు మా ఇంటి ముందుకు గంగా మాత వచ్చింది. ఇంటి ముంగిటే గంగా మాతను పూజించి ఆశీర్వాదాలు పొందాను. జై మా గంగా.” అంటూ చంద్రదీప్ నిషాద్ రాశారు.

Advertisement

ఇక ఆయన ఇన్‌స్టాగ్రామ్ బయోను పరిశీలిస్తే – “PSO Hon’ble Justice Allahabad High Court, National Swimmer and UP Police Swimming Champion” అని ఉంది. అంటే ఆయన జాతీయ ఈతగాడిగా కూడా పేరు పొందారు. అందుకే ఆ నీటిలో ఈత వేస్తున్న వీడియోను కూడా ఆయన తేలిగ్గా తీసుకున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు..

Advertisement

ఈ వీడియోపై నెటిజన్ల స్పందిస్తూ “ఇది నీటిమట్టం పెరిగిందని తెలియజేసే బాధాకర పరిస్థితి” అని చెప్పినా… మరికొందరు – “ఆఫీసర్ భక్తిని మెచ్చుకోవాలి, ఆయన ఆ పరిస్థితిని మానసికంగా అధిగమించడానికి భక్తిని అస్త్రంగా మార్చుకున్నారు” అని ప్రశంసించారు. ఇక మరికొందరు అయితే “ఇది పబ్లిసిటీ కోసమే”, “ఇలాంటివి చేయడం కన్నా ప్రజలకి సహాయపడే పనులు చేయాలి” అంటూ విమర్శలు చేశారు.  చంద్రదీప్ నిషాద్ చేసిన పని నమ్మకాన్ని చూపించే విధంగా ఉన్నా… ఇది కొందరికి విచిత్రంగా అనిపించింది. వరదనీరు ఒక సమస్య. అయితే అది ఎవరి ఇంటికొచ్చినా భయపడి పోయే పరిస్థితుల్లో – నీటిని దేవతగా భావించి, పూజించడం ఒక భిన్నమైన ఆలోచనకే సంకేతం.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×