Gandikota Tourism Project: రాయలసీమ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పర్యాటక ప్రాంతం గండికోట. అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ కనువిందు చేస్తుంది ఈ ప్రాంతం. రెండు రాతి గుట్టల నడుమ పారే పెన్నా నది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే.. హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే అద్భుతమైన ప్రదేశంగా అలరిస్తుంది. అంతటి అందమైన గండికోట ఇప్పుడు మరింత అద్భుతంగా ముస్తాబు కాబోతోంది. ఏపీలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపొందబోతోంది. ఇందుకోసం ఏపీ సర్కారు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. తాజాగా గండికోట పర్యాటక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
పర్యాటక ప్రాంతంగా గండికోటను అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తాజాగా గండికోటలో జరిగిన ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొన్న ఆయన.. గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్‌గా పేరొందిందన్నారు. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించి, తర్వాత విజయనగర రాజులు పాలించిన ఈ ప్రాంతం చారిత్రక సంపదకు ప్రతిరూపంగా కొనసాగిందన్నారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.
వ్యూపాయింట్, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ
పర్యాటకులు బసచేసేలా గండికోటలో స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్‌తో పాటు, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్‌తో పాటు కోటవద్ద లైటింగ్ సహా పలు మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు సందర్శించినవారికి మంచి అనుభూతి కలిగేలా రోప్‌వే, గ్లాస్ బాటమ్ వాక్ వే, లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది చివరికల్లా టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రాండ్ కాన్యన్ ను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలిరైడ్స్ కూడా సెప్టెంబరు నుంచి మొదలవుతాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు కారావాన్ టూరిజం సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
🚨CM to lay foundation for ₹77.91 Cr Gandikota Tourism Project today including Tent City.
🏨 Also to virtually launch Lemon Tree Premier, Tirupati & ₹165 Cr tourism projects across the state. #AndhraPradesh #Tourism pic.twitter.com/pNiDKL9dJo
— Andhra Nexus (@AndhraNexus) August 1, 2025
రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పొరేషన్‌తో రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. గండికోటతోపాటు శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హై రోప్, కయాకింగ్, జెట్ స్కీయింగ్‌లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఒప్పందాలు కుదిరాయి. కేంద్రప్రభుత్వ పథకాలైన సాస్కి, స్వదేశ్ దర్శన్ పథకాల కింద గండికొట, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో వివిధ టూరిజం ప్రాజెక్టులను సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. విశాఖ, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోటలను 7 యాంకర్ హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. అలాగే 25 థీమాటిక్ సర్క్యుట్‌లను కూడా ప్రకటించామన్నారు. అటు గండికోట గ్రాండ్ కాన్యన్ సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడే ఉన్న టూరిస్ట్ గైడ్, పర్యాటకులతో కొద్దిసేపు ముచ్చటించారు.
Stunning view, isn’t it? Can you guess where this is? Here’s a hint: It’s known as the Grand Canyon of India. pic.twitter.com/QjTMPLRorB
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2025
Read Also: మొదటిసారి శాఖాహారం తిన్న సింహం.. దాని ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. గంట నవ్వుతారు!