BigTV English

Bigg Boss 8 Analysis: అవినాష్‌కు గెలుపు శాతం ఎంతంటే.?

Bigg Boss 8 Analysis: అవినాష్‌కు గెలుపు శాతం ఎంతంటే.?

Bigg Boss 8 Analysis: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలారు. మొదటి నుండి అడ్డంకులు అన్నీ దాటుకుంటూ, ఎలిమినేషన్ నుండి తప్పించుకొని గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ మాత్రమే టాప్ 5 వరకు చేరుకున్నారు. సీజన్ చివరి దశకు చేరుకుంది కాబట్టి ఈసారి విన్నర్ ఎవరు అవుతారు అనే విషయంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. గెలిచే శాతం ఎవరికి ఎక్కువగా ఉందని విశ్లేషణ జరుగుతోంది. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ముందుగా మొదటి ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నాడు అవినాష్. అయితే అవినాష్‌కు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా చూసేద్దాం..


అదొక్కటే ప్లస్

బిగ్ బాస్ 8 మొదటి ఫైనలిస్ట్ అయిన అవినాష్‌కు ఉన్న ఒకేఒక్క పెద్ద ప్లస్ పాయింట్. తను ఎంటర్‌టైన్మెంట్ అందించగలడు. ఎలాంటి సందర్భంలో అయినా ఎంటర్‌టైన్మెంట్ అందించడంలో అవినాష్ ముందుంటాడు. తన వల్ల హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ మాత్రమే కాదు.. బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు కూడా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ 8లో అవినాష్ అందించిన ఎంటర్‌టైన్మెంట్ మరెవ్వరూ అందించలేదని చాలామంది ఫీలవుతున్నారు. అవినాష్ వల్లే కిచెన్ టైమ్ కూడా చాలాసార్లు పెరిగింది. ఆ విషయంలో తనకు ఫుడ్ క్రెడిట్ ఇవ్వొచ్చు.


Also Read: బిగ్ బాస్ 8 లో విష్ణు ప్రియా ఎంత సంపాదించిందో తెలుసా..?

అవే మైనస్

అవినాష్‌లో పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అది తను ఇప్పటివరకు నామినేషన్స్‌లోకి రాకపోవడమే. బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు అవినాష్. తను వచ్చి ఇప్పటికీ 8 వారాలపైనే అయ్యింది. అందులో రెండు వారాలు తనే మెగా చీఫ్ అయ్యి నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత మొదటి ఫైనలిస్ట్ అయ్యి నేరుగా ఫైనల్స్‌లోకి వచ్చేశాడు. ఇన్ని వారాల్లో అవినాష్.. ఒకేఒక్కసారి మాత్రమే నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఆవారం తను ఎలిమినేట్ కూడా అయిపోవాల్సింది. కానీ నబీల్ దగ్గర ఉన్న ఎలిమినేషన్ షీల్డ్‌కు అవినాష్‌కు ఇచ్చి తనను కాపాడాడు. కంటెస్టెంట్‌గా అవినాష్ దగ్గర ఉన్న మరో పెద్ద మైనస్.. ఫ్రెండ్‌షిప్. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ కలిసి గ్రూప్ గేమ్ ఆడినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇతర కంటెస్టెంట్స్ గ్రూప్ గేమ్ ఆడారని ఎప్పుడూ వేలెత్తి చూపిస్తూ ఉండేవారు.

విన్నర్ అవ్వడం కష్టమే

బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన తర్వాత అవినాష్ ఆడిన టాస్కులు తక్కువే. అందులో తను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది బ్యాగ్స్ టాస్క్. అవతలి వైపు పృథ్వి, నిఖిల్ లాంటి ఆటగాళ్లు ఉన్నా కూడా అవినాష్ వారిని ఎదిరించి ఆడగలిగాడు. తను రెండోసారి మెగా చీఫ్ అయిన టాస్కును కూడా అవినాష్ బాగానే పూర్తిచేశాడు. అవి కాకుండా మిగతా టాస్కులన్నీ దాదాపుగా తను ఫ్రెండ్స్ సపోర్ట్‌తోనే గెలిచాడు. కంటెస్టెంట్‌గా అవినాష్ చుట్టూ పెద్దగా కాంట్రవర్సీలు ఏమీ లేవు. ఇక అవినాష్ ఇప్పటివరకు నామినేషన్స్‌లోకి రాకుండా నేరుగా ఫైనల్స్‌లోకి వచ్చేశాడు కాబట్టి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ముందుగా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసే అవకాశం తనకే ఎక్కువగా ఉంది. ఫైనల్స్‌లో ముందుగా వేటు పడేది అవినాష్‌పైనే అవ్వొచ్చు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×