Himaja:హిమజ(Himaja).. బిగ్ బాస్-3 (Bigg Boss 3) ద్వారా ఫేమస్ అయిన నటి హిమజ.. బిగ్ బాస్ తర్వాత పలు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలాగే ఈవెంట్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. అయితే అలాంటి హిమజ బిగ్ బాస్ కి వెళ్ళివచ్చాక తన లైఫ్ ఎలా ఉంది అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే కోట్లు పెట్టి కట్టుకున్న డ్రీమ్ హౌస్ గురించి కూడా మాట్లాడింది. అయితే హిమజ ఇల్లు కొన్న వెంటనే ఆమెకు ఇండస్ట్రీలో ఉన్న ఓ వ్యక్తి కోట్లు పెట్టి ఇల్లు కట్టించాడని ఒక రూమర్ వినిపించింది.అయితే తాజాగా ఆ రూమర్ పై కూడా హిమజ క్లారిటీ ఇచ్చింది. మరి ఇంతకీ హిమజ (Himaja)కు కోట్లు పెట్టి ఆ ఇల్లు కట్టించిన వ్యక్తి ఎవరు ? దానిపై హిమజ ఏం చెప్పింది? ఇప్పుడు చూద్దాం..
షాపింగ్ మాల్స్ తోనే మంచి కార్ కొన్నాను..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ (Bigg Boss) షోకి వెళ్లి వచ్చాక మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్నాను. దాదాపు ఓ 15 షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్లాను. అయితే ఈ విషయాన్ని నేను ఒక వీడియో లాగా చేసి అభిమానులతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది అని ట్రోల్స్ చేస్తారని వదిలేసాను. అలాగే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను. లగ్జరీ కారు కూడా కొన్నాను. కానీ నేను ఇల్లు కట్టుకొని,కారు కొనడంతో ఎవడో నాకు ఇల్లు కట్టించాడని, మరెవరో నాకు లగ్జరీ కార్ గిఫ్ట్ గా ఇచ్చారని సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేశారు. బిగ్ బాస్ వెళ్లి వచ్చాక ఎన్నో ఈవెంట్స్ కి వెళ్లాను. ఆ ఈవెంట్స్ లో వచ్చిన డబ్బుతో నేను ఒక కారు కొనుక్కోలేనా.. దానికి వేరే వాళ్ళు కొనివ్వాలా.. అలాగే నేను నా డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నాను.
ఆ రూమర్స్ మా నాన్న వింటే..ఆయన ఏమవ్వాలి
కానీ ఆ ఇంట్లోకి వెళ్లిన సమయంలో నాకు ఇండస్ట్రీలో ఉన్న ఓ వ్యక్తి ఇల్లు కట్టించాడని రూమర్ వైరల్ చేశారు.ఆ ఇల్లు నా కష్టార్జితంతో పాటు నా తండ్రి కష్టార్జితం కూడా వుంది.. నేను ఇల్లు కట్టుకున్న సమయంలో నా ఫ్యామిలీ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచి, ఇల్లు కట్టడానికి ఖర్చు అయ్యే కొంత డబ్బులు నాకు ఇచ్చారు. కానీ ఎవరో కట్టించారని అంటే మా నాన్న గుండె పగిలిపోదా.. ఎవరైనా బాగా బ్రతికితే ఓర్వలేని వాళ్ళు ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తారు. ఇలాంటివి ఎన్నో నేను ఇండస్ట్రీలో ఫేస్ చేశాను. అయితే వాటిని పట్టించుకోను. చాలామంది మన ముందు ఒకలా మన వెనకాల మరొకలా ఉంటారు. అందుకే ఎవరేం చెప్పినా కూడా నేను పట్టించుకోను. అలాగే ఫేక్ ఫ్రెండ్స్1000 మంది ఉండే కంటే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంటే చాలు. నాకు శివ జ్యోతి(Shiva Jyothi) ఒక్కరే హార్ట్ ఫుల్ ఫ్రెండ్. ఆమె చాలా ఓపెన్ మైండెడ్..అంటూ హిమజ(Himaja) ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది.