IPL 2025: ప్రపంచ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం అవుతుంది. ఈ ఐసీసీ మహా సంగ్రామానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. ఓవైపు వార్మప్ మ్యాచ్ లు కూడా ప్రారంభమయ్యాయి. మరో వైపు త్వరలోనే ఐపిఎల్ 18 వ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం ఇచ్చింది.
Also Read: No Indian Flag at Stadium: టీమిండియాకు ఘోర అవమానం.. అరె ఎంతకు తెగించార్రా..?
కానీ తేదీ, జట్ల గురించి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ మార్చ్ 22 శనివారం రోజున జరగబోతున్నట్లు సమాచారం. ఈ మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభం అవుతుంది. ఈ మొదటి మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తరువాత, ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో క్రీడాభిమానులను దెబ్బ కొట్టారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ.
రిలయన్స్ కి చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనంతో కొత్తగా ఏర్పడిన జియో హాట్ స్టార్ క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్ 2025 సీజన్ మ్యాచ్ లను ఫ్రీగా చూసే అవకాశాలను ఎత్తివేసింది. ఈ మ్యాచ్ లు చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందే. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్ లు చూసే అవకాశం ఉండదు. గతంలో జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేరువేరుగా ఉండేవి.
ఇప్పుడు ఈ రెండు విలీనమై జియో హాట్ స్టార్ గా కొత్త వేదికను శుక్రవారం ప్రారంభించాయి. ఈ క్రమంలో జియో హాట్ స్టార్ లో ఉచితంగా ఈ మ్యాచ్ లు ప్రసారం చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. కొద్ది నిమిషాల పాటు ఫ్రీ టైం తర్వాత.. స్ట్రీమింగ్ ఆగిపోతుంది. ఆ తరువాత డబ్బులు చెల్లిస్తేనే మ్యాచ్ లు చూడవచ్చు. ఈ ప్లాన్ లు రూ.149 నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ 149 బేసిక్ ప్లాన్ మూడు నెలలు. ఒకవేళ ఏడాది ప్లాన్ కావాలంటే రూ. 499 చెల్లించవలసిందే.
Also Read: Virender Sehwag: వరల్డ్ భయంకరమైన బ్యాట్స్ మెన్… బౌలర్ కు గులాబ్ జామ్ లు గడగడలాడాల్సిందే?
అయితే ఈ ఆఫర్ కేవలం మొబైల్ లో చూసేందుకు మాత్రమే. ఒకవేళ మూడు నెలల పాటు రెండు డివైజ్ లలో యాప్ ని యాక్సెస్ చేసుకోవాలంటే రూ. 299 చెల్లించాలి. అలాగే రెండు డివైజ్ లలో ఏడాది సబ్క్క్రిప్షన్ కావాలంటే రూ. 899 చెల్లించాలి. 2022 సంవత్సరంలో రిలయన్స్ కి చెందిన వయాకామ్ 18 ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్ ని సుమారు రూ. 23,758 కోట్లకు దక్కించుకుంది. 2023 నుండి 2027 వరకు ఈ హక్కులను సొంతం చేసుకుంది. అలా 2023, 2024 సంవత్సరాలలో ఐపీఎల్ ని ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించి.. ఇప్పుడు ఉచితంగా చూసే అవకాశాలను ఎత్తివేసింది. ఈ నిర్ణయం పట్ల క్రీడాభిమానులు మండిపడుతున్నారు.
🚨 PLANS LAUNCHED FOR HOTSTAR. 🚨
– JioHostar has launched the new plans which start from 149rs for 3 months. pic.twitter.com/LozrHe8nyL
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025