Anil vs Bandi Sajay: బీసీ రిజర్వేషన్ల వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీ-బీజేపీల మధ్య మాటల యుద్ధం క్రమంగా ముదురుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రుసరుసలాడారు తెలంగాణ మినరల్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవర్తి అనిల్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచన చేశారు.
తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ బండి సంజయ్ కేంద్రమంత్రి ఉన్నారన్నారు అనిల్. ముస్లింలను బీసీలలో చేర్చితే ఊరుకోమని వ్యాఖ్యానించడంపై నోరు విప్పారు. కేంద్ర మంత్రి మాట్లాడే ముందు కనీసం మేధావులతో చర్చించి మాట్లాడితే బాగుండేదన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే ఒప్పుకోమని అంటున్నారని, కనీసం మండల్ కమిషన్ గురించి కేంద్రమంత్రి తెలుసుకోవాలన్నారు.
హిందూ బీసీ లు 43 శాతం.. ముస్లిం బీసీలు 8 శాతం ఉన్నారని మండల్ కమిషన్ సిఫార్సు ఆనాడు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగంలో రిజర్వేషన్లు కల్పించిందన్నారు. అందులో ముస్లింలు సైతం ఉన్నారని తెలిపారు. ఓబీసీలలో ముస్లింలు సెంట్రల్ లిస్ట్ లో ఉన్నారని వివరించారు. ఈ మాత్రం అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.
రాష్ట్రాలకు కేటగిరి చేసుకునే అవకాశం ఉందని, బీసీల్లో క్రైస్తవులు సైతం ఉన్నారని తెలిపారు మినరల్ కార్పొరేషన్ ఛైర్మన్. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తే బీజేపీ మనుగడ ఉండదన్న విషయం కమలనాథులకు తెలుసన్నారు. EWS రిజర్వేషన్ 10 శాతం ఇచ్చిన మీరు, బీసీల రిజర్వేషన్ ఎందుకు పెంచారని ప్రశ్నించారు.
ALSO READ: తెలంగాణలో ఇక మొదలు.. సొంటిల్లు నిర్మించేవారికి గుడ్ న్యూస్
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కులం ఎందుకు.. గుణం ముఖ్యమన్నారని అనిల్ ప్రస్తావించారు. కుల గణన వద్దు అంటున్నారని, గణన లేకుండా రిజర్వేషన్ పెంపు ఎలా సాధ్యమన్నారు. మోడీని ఒప్పించి కులగణన చేయిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటం చేద్దామని సవాల్ విసిరారాయన.
బీసీల రిజర్వేషన్ పెంపుకు చట్టం చేయబోతున్నామని, కేంద్రంపై కలిసి ఒత్తిడి తెచ్చేందుకు కలసి రావాలని బండి సంజయ్‌ను అనిల్ కోరారు . హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి.. కారు పోతే కారు ఇస్తామని అన్నారని, ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారని గుర్తు చేశారు అనిల్.
బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈరవత్రి అనిల్ కౌంటర్
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందన్న అనిల్
కార్పొరేట్ స్థాయిలోనే మాట్లాడతానంటే సమాజం, ప్రజలు హర్షించరని హితవు
ముస్లింలను బీసీల్లో చేరిస్తే ఒప్పుకోము అన్న బండి వ్యాఖ్యలను తప్పుబట్టిన ఈరవత్రి అనిల్ pic.twitter.com/6kQVmwHExV
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025