BigTV English
Advertisement

Bigg Boss Kannada : షోను వదిలిపెట్టడానికి కారణం ఇదేనంటూ బాంబ్ పేల్చిన సుదీప్

Bigg Boss Kannada : షోను వదిలిపెట్టడానికి కారణం ఇదేనంటూ బాంబ్ పేల్చిన సుదీప్

Bigg Boss Kannada : తెలుగులో బిగ్ బాస్ (Bigg Boss) షోకి ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ షోకి తెలుగులో మాత్రమే కాదు హిందీ, కన్నడలో కూడా ఇదే రేంజ్ లో బుల్లితెర అభిమానులు ఉన్నారు. కన్నడలో అయితే దాదాపు సీజన్ల నుంచి హోస్ట్ గా హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) ఒక్కరే వ్యవహరిస్తుండడం విశేషం. అయితే ఆయన ఈ షోకి హోస్టుగా వ్యవహరించడం ఇదే చివరిసారి అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమా ‘మ్యాక్స్’ (Max Movie) ప్రమోషన్లలో భాగంగా తను ఎందుకు బిగ్ బాస్ షో నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడో కారణం చెప్పి బాంబు పేల్చారు.


కన్నడలో బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైనప్పటి నుంచి హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హోస్ట్ గా చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా ఆయన ఈ షోను హోస్ చేస్తున్నారు. ఇక తాజాగా ఆయన  బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 (Bigg Boss Kannada Season 11)  కి కూడా హోస్టుగా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇక మీదట రాబోయే సీజన్లకు తాను హోస్ట్ గా చేయబోనని, ఇదే తన చివరి సీజన్ అంటూ అక్టోబర్లో అనౌన్స్ చేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుదీప్ (Kiccha Sudeep) మాట్లాడుతూ అలా చెప్పడానికి గల కారణం ఏంటో వెల్లడించారు. “బిగ్ బాస్ గుడ్ బై చెప్తున్నాను అని ట్విట్ చేసిన రోజు నేను చాలా అలసిపోయాను. అప్పుడు నా మనసుకేమనిపించిందో అదే చెప్పాను. అంతేకాకుండా అంతర్గత లోటు పాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యాయి. ఒకవేళ ఆరోజు ఆ ట్వీట్ వేయకపోయి ఉంటే నా ఆలోచనలు, అభిప్రాయాలు మారేవేమో. కానీ బిగ్ బాస్ ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ఆ ట్వీట్ చేశాను. ఆ మాటపై నిలబడాలని నాకు నేను చెప్పుకున్నాను.


కొన్నిసార్లు నేను నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు అని అన్పిస్తుంది. ఎంత కష్టపడ్డా అక్కడ పెద్దగా ఫలితం కనిపించట్లేదు. అలాంటప్పుడు అదే కష్టం నేను సినిమాలపై పెడితే బాగుంటుంది అనిపించింది. అంతేకాకుండా మిగతా భాషలో బిగ్ బాస్ షోకి మంచి గుర్తింపు, ఆదరణ వస్తోంది. కానీ కన్నడ బిగ్ బాస్ కి రావట్లేదు. మిగతా భాషలో షోలతో కన్నడ షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి” అంటూ తను బిగ్ బాస్ ను వదిలిపెట్టబోతున్నట్టు అనౌన్స్ చేయడానికి గల కారణాన్ని వివరించారు సుదీప్.

ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ (Kiccha Sudeep) ప్రస్తుతం ‘మ్యాక్స్’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న కన్నడలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు సుదీప్.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×