BRS: హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో పార్టీ చీఫ్ కేసీఆర్‌తో సమావేశమయ్యా రు కేటీఆర్-హరీష్‌రావులు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కార్యాలయంపై జరిగిన దాడి జరిగింది. ఈ క్రమంలో ఇరువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై ఆ పార్టీ ముఖ్యనేతలు చర్చిస్తున్నారు.
మల్లన్న కార్యాలయంపై దాడి విషయంలో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందా? ఆమెకు మద్దతుగా వెళ్తే బీసీలు దూరమవుతారని భావిస్తోందా? ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని ఆలోచన చేస్తోందా? అవుననే సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.
సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నందినగర్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు కేటీఆర్-హరీష్‌రావులు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు, మల్లన్న ఆఫీసుపై జరిగిన దాడి గురించి నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అనేదానిపై ముగ్గురు నేతలు చర్చించారు.
ఇదే విషయంలో జాగృతి కార్యకర్తలు ఉమెన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఉదయం వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనికితోడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నేతలు చర్చించినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి? అనేదానిపై చర్చించారట.
ALSO READ: మహిళలకు తీపి కబురు.. ఇక వారికి డబ్బే డబ్బు
లిక్కర్ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు కవిత. అయితే ఆమె రాసిన లేఖ బయటకు రావడంతో పార్టీలో వ్యవహారాలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కొద్దిరోజులుగా కవిత వివిధ కార్యక్రమాల పేరిట నిరసనలు చేపట్టారు. ఏ విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కనీసం ఆమె దగ్గరకు వెళ్లిన సందర్భం లేదు.
బీసీల రిజర్వేషన్ల విషయంలో కవిత ధర్నా చేసినప్పటికీ ఆ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. కేవలం జాగృతి కార్యకర్తలు ఆమె వెంట నిలిచారు. ఆదివారం ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ కాలేదు. దీంతో కవిత-బీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరిగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటోదనని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమెకు మద్దతుగా వెళ్లే బీసీలు దూరం అవుతారేమోనని భావిస్తున్నారు. ఎందుకంటే మల్లన్న కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. ఈ విషయంలో సైలెంట్‌గా ఉండటమే బెటరని అంటున్నారు కొందరు నేతలు.