E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : వారం ముందే విన్నర్ ను డిసైడ్ చేశారా..? ఈ సీజన్ విన్నర్ ఎవరంటే..?

Bigg Boss 9 Telugu : వారం ముందే విన్నర్ ను డిసైడ్ చేశారా..? ఈ సీజన్ విన్నర్ ఎవరంటే..?
Advertisement

Bigg Boss 9 Telugu : జనాల నోట వినిపిస్తున్న ఒకే ఒక్కమాట బిగ్ బాస్.. రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి చేరుకోవడంతో, హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.. గత వారం కన్నడ సీరియల్ నిఖిల్ ట్రోఫీని అందుకున్నాడు. ఇప్పుడు ప్రసారం అవుతున్న సీజన్ లో కూడా కన్నడ బుల్లితెర యాక్టర్ తనూజ విన్నర్ అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కళ్యాణ్ విన్నర్ అవుతాడని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 14 వ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందని ఇప్పటికే ఓ రేంజులో వార్తలు వినిపిస్తున్నాయి. సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ అయ్యినట్లు తెలుస్తుంది.. ఇవాళ ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. రేపు భరణి ఎలిమినేట్ అవుతారా..? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు అన్నది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. జనాల అభిప్రాయాలు, ఓటింగ్ ప్రకారం చూస్తే విన్నర్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం…

సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్..

ప్రతివారం లాగే ఈ వారం కూడా నామినేషన్స్ లేకుండానే హౌస్ మేట్స్ ను బిగ్ బాస్ నామినేట్ చెసాడు లీడర్ స్కోర్ లో ఎక్కువ నంబర్స్ ఉన్న వాళ్ళను ఫైనలిస్ట్ లోకి పంపించాడు. మిగిలిన తక్కువ స్కోర్ ఉన్న వాళ్లను హౌస్ నుంచి బయటకు వెళ్లాలని చెప్తారు. ఈ క్రమంలో ముందుగా తక్కువ స్కోర్ ని పొందిన సుమన్ శెట్టి పోరు నుంచి తప్పుకోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు.. ఆ తర్వాత భరణి కూడా తక్కువ స్కోరు ఉండడంతో అతని కూడా ఈ పోరు నుంచి తప్పుకోవాలని బిగ్ బాస్ అంటాడు.. అయితే వీరిద్దరూ తక్కువ స్కోర్ ని లీడర్ బోర్డులో నమోదు చేసుకున్నారు కాబట్టి బిగ్ బాస్ ముందుగా చెప్పినట్లు నామినేషన్స్ లోకి వచ్చేసారు. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి, ఆదివారం ఎపిసోడ్లో భరణి ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈవారం అందరూ ఊహించినట్లుగానే డబల్ ఎలిమినేషన్ జరిగింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు.. మరి వీరికి ఫైనల్ కు చేరేందుకు బిగ్ బాస్ ఎలాంటి టఫ్ టాస్కులు ఇస్తాడు అన్నది చూడాలి..

Advertisement

Also Read : ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు…ఆ 3 మిస్ చెయ్యకండి..

ఈ సీజన్ విన్నర్ ఎవరంటే..? 

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. ఈ షో ఇప్పటికే 8 సీజన్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ సీజన్ కి ముగింపు పలకనుంది.. కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9 పూర్తి కానుంది. గత సీజన్లోతో పోలిస్తే ఈ సీజన్ ముందుగా చెప్పినట్లుగా భిన్నంగా మొదలైంది. కంటెస్టెంట్ లో ఎంపిక నుంచి టాస్కుల వరకు అన్ని డిఫరెంట్ గా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ ఎటువంటి కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారలేదు. కేవలం సాఫ్ట్ గా సాఫీగా ఎపిసోడ్లను పూర్తి చేస్తుంది. మొత్తానికి శుభం కార్డు వేసుకోబోతుంది. మరి ఈ సీజన్ కి విన్నర్ గా ఎవరిని నిలుస్తారు? రన్నర్ గా ఎవరిని నిలుస్తారు? అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి.. గత సీజన్ కన్నడ ఇండస్ట్రీలోని యాక్టర్ కు ఇవ్వడంతో విమర్శలు మొదలయ్యాయి.. తెలుగు వాళ్లని వదిలేసి కన్నడ వాళ్లకి ఎందుకు ట్రోఫీన్ ఇచ్చారు అంటూ బిగ్ బాస్ పై ట్రోల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఉన్న టాప్ కంటెస్టెంట్లలో తనూజ, కళ్యాణ్, ఇమ్మానుయేల్ ముగ్గురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్నారు.. తను జాకి టోపీ ఇస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ పై దారుణమైన ట్రోల్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ వరుసలో ఉన్న కళ్యాణ్ విన్నర్ అవుతాడంటూ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఎక్కువమంది అతనే వినరని ఓటింగ్ కూడా ఇస్తున్నారు.. మరి ఈ సీజన్ కు కళ్యాణ్ విన్నర్ గా నిలుస్తాడా? లేదా రన్నర్ గా నిలుస్తాడా అన్నది కేవలం కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×