E-Paper
Advertisement

OTT Movie : 40 ఏళ్ల వయసొచ్చినా కాని ఆ పని… అందగాడికి అమ్మాయే కరువాయే… సింగిల్స్ కి ఫీస్ట్ ఈ మూవీ

OTT Movie : 40 ఏళ్ల వయసొచ్చినా కాని ఆ పని… అందగాడికి అమ్మాయే కరువాయే… సింగిల్స్ కి ఫీస్ట్ ఈ మూవీ
Advertisement

OTT Movie : 2005 లో వచ్చిన ఒక మూవీ కామెడీ జానర్‌కు బెంచ్‌మార్క్ అయింది. ఫ్రెండ్‌షిప్, రొమాన్స్‌ను కొత్త కోణంలో చూపించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా $26 మిలియన్ బడ్జెట్‌తో $177 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ప్రధాన పాత్ర పోషినచ్చిన స్టీవ్ కారెల్ కి బ్రేక్‌థ్రూ రోల్ గా మిగిలిపోయింది. ఈ కథ 40 ఏళ్లు వచ్చినా కూడా వర్జిన్ గా ఉండే ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని వర్జినిటీని పోగొట్టడానికి ఫ్రెండ్స్ రక రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్’ (The 40 Year Old Virgin). జడ్ అపాటో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో స్టీవ్ కారెల్, క్యాథరిన్ కీనర్, పాల్ రడ్, రోమనీ మాల్కో, సేథ్ రోగెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇయండిబిలో ఈ సినిమా 7.1/10రేటింగ్ తో కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయింది. ప్రస్తుతం Amazon Prime Videoలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : నెత్తురుడికించే రియల్ స్టోరీ… ఒకే అమ్మాయిపై ఒక్కొక్కరూ… ఇది దాహం తీరని కథ

స్టోరీ ఏమిటంటే

ఆండీ అనే 40 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి , ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తుంటాడు. జీతం మంచిది, అందమైన అపార్ట్‌మెంట్ ఉంది. అతను సైకిల్ ఎక్కి ఆఫీస్‌కి వెళ్తాడు, స్నేహితులతో జీవితం సాఫీగా సాగుతుంది. కానీ ఒక్కటే సమస్య ఉంటుంది. అతను ఇంకా వర్జిన్ గానే ఉంటాడు. ఆ అనుభవం కోసం టీనేజ్ నుంచి పలు సార్లు ట్రై చేశాడు. కానీ ఏదో ఒక కారణంగా ఆ కార్యం మాత్రం వాయిదా పడుతూనే ఉంటుంది. అతను దాని గురించి ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా బాధపడుతుంటాడు. ఒక రోజు ఆఫీస్ లో స్నేహితులతో పోకర్ ఆడుతుంటే, మాటల మధ్యలో ఆండీ సీక్రెట్ బయటపడుతుంది. స్నేహితులు విషయం తెలుసుకుని షాక్ అవుతారు. ఆండీ 40 ఏళ్ల వర్జినా?!” అని ఆశ్చర్యపోతారు.

Advertisement

వాళ్లు వెంటనే మిషన్ స్టార్ట్ చేస్తారు. అతనికి డేటింగ్ అడ్వైస్ ఇస్తారు, బార్‌కి తీసుకెళ్తారు. అదే సమయంలో అతను త్రిష్ అనే ఒక మహిళను కలుస్తాడు. ఆమెకు కూడా అతని వయసే ఉంటుంది.కాకపోత ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్తతో విడిపోయి ఉంటుంది. ఇద్దరూ బాగా కనెక్ట్ అవుతారు. కాకపోతే ఆండీ తన సీక్రెట్ ఆమెకు చెప్పలేకపోతాడు. ఆమెతో రొమాంటిక్ గా కలవలేక పోతాడు. ఇక స్టోరీ ముగింపుకు వస్తుంది. చివరికి ఆండీ తన వర్జినిటీని ఎవరితో కోల్పోతాడు ? వర్జిన్ గానే మిగిలిపోతాడా ? ఈ కథకు ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్  కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×