OTT Movie : చిన్నపిల్లలు మెచ్చే ఒక ఫాంటసీ సినిమా ఓటీటీలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో పిల్లలు జంతువులరూపంలోకి మారుతుంటారు. ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న పిల్లలను, రహస్యంగా ఒక స్కూల్ నడుపుతుంతుంటుంది. ఈ సినిమా ‘హ్యారీ పోట్టర్’ లాంటి కథనంతో వస్తోంది. మరి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. పిల్లలతో పాటు, మీరుకూడా దీనిపై ఓ లుక్ వేయండి. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్
‘వుడ్‌వాకర్స్’ (Woodwalkers) ఒక జర్మన్-ఇటాలియన్ ఫ్యామిలీ ఫాంటసీ చిత్రం. దీనికి డామియన్ జాన్ హార్పర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎమిలీ చెరిఫ్, లిల్లీ ఫాక్ , జోహన్ వాన్, ఒలివర్, మార్టినా గెడెక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 అక్టోబర్ 11న మ్యూనిచ్‌లోని మాథేసర్ ఫిల్మ్‌పలాస్ట్‌లో ప్రీమియర్ అయింది. 2024 అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఇది 2025 ఆగస్టు 22 నుంచి లయన్స్‌గేట్ ప్లేలో జర్మన్, ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం 103 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది.
కథలోకి వెళ్తే
కారగ్ అనే 13 ఏళ్ల అబ్బాయి, బయటి నుండి చూడటానికి సాధారణంగా కనిపిస్తాడు. కానీ అతని మెరిసే కళ్ళ వెనుక ఒక సీక్రెట్ దాగి ఉంటుంది. అతను ఒక వుడ్‌వాకర్. అంటే పుమాగా రూపం మార్చగలడు. అడవిలో పుమాగా పెరిగిన కారగ్, మానవ ప్రపంచంలో జీవించడం కష్టంగా భావిస్తాడు. తన రూపాన్ని దాచుకోవడానికి ఇక్కడ కష్టపడుతుంటాడు. అతని జీవితం ఒక రహస్యమైన బోర్డింగ్ స్కూల్‌లో చేరినప్పుడు మారుతుంది. ఇక్కడ అతని లాంటి జంతు రూపం మార్చగల పిల్లలు ఉంటారు. ఈ స్కూల్‌లో, కారగ్ తన శక్తులను నియంత్రించడం నేర్చుకుంటాడు. హోల్లీ ఒక ధైర్యమైన ఎర్ర ఉడుత షిఫ్టర్, బ్రాండన్ ఒక సిగ్గుపడే బైసన్, వీళ్ళతో కారగ్ స్నేహం చేస్తాడు. ఈ స్కూల్ ని ఆండ్రూ మిల్లింగ్ అనే ఒక ధనవంతుడైన మాజీ పుమా షిఫ్టర్ నియంత్రిస్తుంటాడు. అతను కారగ్ అసాధారణ సామర్థ్యాలను గుర్తిస్తాడు. స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ లిస్సా క్లియర్‌వాటర్, ఉపాధ్యాయురాలు అన్నా రాల్స్టన్ కారగ్‌కు సహాయం చేస్తారు.
అయితే మరోవైపు తోడేలు రూపంలో మారే వాళ్లకి జెఫ్రీ నాయకత్వం వహిస్తుంటాడు. వీళ్లకు సంబంధించిన ఒక విలువైన వస్తువు, పుమా స్కూల్‌లో ఉండటంపై అసంతృప్తితో ఉంటాడు. కథ ఒక మైనింగ్ ఆపరేషన్ కారణంగా, వుడ్‌వాకర్స్ కి ముప్పు వాటిల్లినప్పుడు ఉత్కంఠంగా మారుతుంది. ఈ ముప్పు వుడ్‌వాకర్స్ సంఘాన్ని మాత్రమే కాకుండా సమీపంలోని మానవులను కూడా ప్రమాదంలోకి పడేస్తుంది. ఇప్పుడు కారగ్, హోల్లీ, బ్రాండన్ ఈ రహస్యాన్ని ఛేదించడానికి, తమ ప్రపంచాన్ని రక్షించడానికి కలిసి పనిచేస్తారు. ఈ క్రమంలో కారగ్ తన రెండు రూపాలను, నియంత్రణలో ఉంచడం నేర్చుకుంటాడు. వుడ్‌వాకర్స్ ఇప్పుడు శత్రువులతో పోరాడుతారు. ఇక ఈ స్టోరీ ఊహించని విధంగా ముగుస్తుంది. వుడ్‌వాకర్స్ కి వచ్చిన ముప్పు ఏమిటి ? కారగ్ దీనిని ఎలా ఎదుర్కొంటాడు ? తోడేలు నాయకుడితో ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే , ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం