Bigg Boss 9 : బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షుగర్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమానికి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది.. అయితే ఈ కార్యక్రమం పై కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు కూడా చేస్తుంటారు. ఇక ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో తెలుగులో కూడా వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం అతి త్వరలోనే 9 వ సీజన్ కూడా ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.
బిగ్ బాస్ లో పాల్గొనే అర్హత ఉందా?
ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు 9వ సీజన్ కి సంబంధించి లోగో ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో విడుదలైనప్పటి నుంచి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా గత కొన్ని సీజన్ల నుంచి టిక్ టాక్ స్టార్ దుర్గారావు(Durgarao) దంపతుల పేర్లు కూడా వినపడుతున్నాయి కానీ ఇప్పటివరకు వీరికి ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు. దీంతో ఇటీవల దుర్గారావు ఒక సంచలనమైన వీడియోని విడుదల చేశారు .
టిక్ టాక్ స్టార్..
గత కొన్ని సీజన్ నుంచి బిగ్ బాస్ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నామని మా పేర్లను బయటకు తీసుకువస్తున్నారు. దీంతో ఎక్కడికి వెళ్లినా మీరు బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్తున్నారు అంటూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే బిగ్ బాస్ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే నాకు పూర్తిగా అర్హత ఉంది కాబట్టే మాట్లాడుతున్నానని దుర్గారావు తెలిపారు. టిక్ టాక్ ద్వారా నేను రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఫేమస్ అయాను అందుకే నాకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. మరి బిగ్ బాస్ అవకాశం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.
లక్షల్లో ఫాలోవర్స్…
తాను 100 మందిలోకి వెళ్తే 99 మంది నన్ను గుర్తుపడతారు. నాకు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటప్పుడు నాకెందుకు అవకాశం ఇవ్వరు. బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఎవరిని పడితే వారిని కాకుండా అర్హత ఉన్నవాళ్లకి ఇవ్వండి అంటూ ఈయన బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా ఫైర్ అయ్యారు. నేను అందరిలాగా నాకు అవకాశం ఇవ్వమంటూ డిమాండ్ చేయలేదు, రైతు బిడ్డ అంటూ సింపతి డ్రామాలు కూడా ఆడలేదు. నా గుర్తింపును చూసి నాకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కల్పించాలి అంటూ దుర్గారావు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దుర్గారావు కోరుకున్న విధంగా నిర్వాహకులు ఈయనకు అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈయన కరోనా టైం లో టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాది నక్కలీసు గొలుసు అనే పాట ద్వారా ఎంతో ఫేమస్ కావడంతో పలు సినిమాలలో కూడా చిన్న పాత్రలలో అవకాశాలు అందుకున్నారు. ఇలా సినిమాలలో అవకాశమందుకున్న దుర్గారావు దంపతులకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: కన్నప్ప థియేటర్లో చూడాలంటే అదృష్టం ఉండాలి.. ఓటీటీలో కుదరదు!