BigTV English

Kannappa Thanks Meet: కన్నప్ప థియేటర్లో చూడాలంటే అదృష్టం ఉండాలి.. ఓటీటీలో కుదరదు!

Kannappa Thanks Meet: కన్నప్ప థియేటర్లో చూడాలంటే అదృష్టం ఉండాలి.. ఓటీటీలో కుదరదు!

Kannappa Thanks Meet: మంచు విష్ణు(Manchu Vishnu)కన్నప్ప సినిమా(Kannappa Movie) జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం తాజాగా థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ థాంక్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు శివబాలాజీ(Siva Balaji) మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో శివ బాలాజీ మహదేవశాస్త్రి పాత్రలో నటించిన మోహన్ బాబుకి కుమారుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.


కన్నప్ప చూడాలంటే అదృష్టం ఉండాలి..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శివ బాలాజీ మాట్లాడుతూ… కన్నప్ప లాంటి ఒక గొప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన మంచు విష్ణుకి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమాను ఇంత మంచి విజయం చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని శివ బాలాజీ వెల్లడించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూస్తే ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తుంటారు కన్నప్ప కూడా అలాంటి అద్భుతమైన సినిమా అని తెలిపారు. కన్నప్ప సినిమా చిన్న పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు చూసే సినిమా అని గుర్తు చేశారు.


ఆలస్యంగా ఓటీటీలోకి

ఇలాంటి ఒక గొప్ప సినిమాని థియేటర్లో చూడాలి అంటే కూడా అదృష్టం ఉండాలని, అదృష్టం చేసుకుంటేనే ఈ సినిమాని థియేటర్లో చూడగలుగుతారు అంటూ శివ బాలాజీ తెలియజేశారు. ఇంతటి గొప్ప అదృష్టాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని సూచించారు. ఇకపోతే ఈ సినిమా కొద్దిరోజుల తర్వాత ఓటీటీ(Ott)లో వస్తుంది అక్కడ చూద్దాంలే అనుకుంటే కుదరదని శివ బాలాజీ తెలిపారు. ఈ సినిమా ఓటీటీలో రావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఇలాంటి ఒక గొప్ప సినిమాని కుటుంబంతో సహా థియేటర్ కి వచ్చి చూడాలని ఈయన తెలియజేశారు. ఈ సినిమాకు ప్రతి చోటా మంచి పాజిటివ్ టాక్ వచ్చి కలెక్షన్లు కూడా మంచిగానే రాబడుతుంది.

రుద్ర పాత్ర హైలెట్..

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా ప్రభాస్(Prabhas) ఈ సినిమాలో రుద్ర పాత్రలో నటించిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఒక ప్రభాస్ సన్నివేశాలను చూడటం కోసం ఆయన అభిమానులు కూడా థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ ఎంతో అద్భుతంగా ఉందని క్లైమాక్స్ సన్నివేశాలలో విష్ణు అదరగొట్టారని చెప్పాలి. ఏది ఏమైనా కన్నప్ప సినిమా ద్వారా మంచి విష్ణు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడమే కాకుండా ఈ సినిమా ద్వారా అతను కూడా ఒక సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పాలి.

Also Read: న్యూస్ ఛానల్‌పై BRS నాయకులు ఎటాక్…  దాడిలో చిక్కుకున్న తెలుగు హీరో

Related News

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Big Stories

×