E-Paper
Advertisement

నామినేషన్స్ లో పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?

నామినేషన్స్ లో  పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారంలోకి అడుగుపెట్టగానే హౌస్‌లో హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుకాగా, ఈసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కీలకమైన అధికారాలు అప్పగించారు. వారి కంట్రోల్‌లో సాగిన నామినేషన్స్ ప్రక్రియలో హౌస్‌మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అమన్, ముకేశ్ మధ్య జరిగిన పెద్ద గొడవ హద్దులు దాటింది. ఈ వారం నామినేషన్స్‌లో జరిగిన రచ్చ ఏంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం..

వైల్డ్ ఫైర్స్ చేతిలో నామినేషన్ పవర్:

ఈ వారం నామినేషన్ల కోసం బిగ్ బాస్ సరికొత్త రూల్ పెట్టారు. ప్రతి రౌండ్ ప్రారంభంలో సైరన్ మోగగానే వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్లు ఇద్దరు ఓజీ కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయాలి. ఆ ఇద్దరూ టాస్కులో తలపడి గెలిచాక, ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ గెలిచినవారికి దక్కుతుంది. ఆ తర్వాత విజేత చెప్పిన కారణాలు, నామినేట్ అయిన వారి వాదనలు విన్నాక వైల్డ్ ఫైర్స్ అందులో ఒకరి నామినేషన్‌ను మాత్రమే ఆమోదించాలి. ఈ పద్ధతిలోనే హౌస్‌లో నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగింది.

రోహిత్ వర్సెస్ వంశీ, ఝాన్సీ:

Advertisement

మొదటి రౌండ్‌లో శివ సెలెక్ట్ చేయగా త్రిగుణ్, రోహిత్ మధ్య గేమ్ జరగగా రోహిత్ విజేతగా నిలిచాడు. మనుషులకు మర్యాద ఇవ్వాలని అంటూ వంశీని, అలాగే ఎవిక్షన్ ప్రీ పాస్‌ను స్వార్థానికి వాడుకున్నావంటూ ఝాన్సీని రోహిత్ నామినేట్ చేశాడు. శివ జోక్యం చేసుకుని వంశీ నామినేషన్‌ను ఆమోదించాడు. ఇక ఆ తర్వాత శ్వేతా నాయుడు నిర్వహించిన గేమ్‌లో ముకేశ్ గెలిచి అమన్, షాలినిలను నామినేట్ చేశారు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది.

అమన్, ముకేశ్ మధ్య హద్దులు దాటిన గొడవ:

ముకేశ్ నామినేట్ చేసిన సమయంలో అమన్ బూతులు, ఫౌల్ లాంగ్వేజ్ వాడటంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మధ్యలో త్రిగుణ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి చేయి దాటింది. “నువ్వు ఎవడివా రా నాకు చెప్పేది?”, “బే అంటే బే అంటా” అంటూ ఇద్దరూ నోరు జారి బూతులు తిట్టుకున్నారు. ఇక మిగతా కంటెస్టెంట్లు వచ్చి వారిని విడదీసి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఒక దశలో వీరిద్దరి ప్రవర్తన చూస్తుంటే బిగ్‌బాస్ వీరికి రెడ్ కార్డ్ ఇస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

also read:విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!

షాలిని – దేబ్జానీ మధ్య మాటల యుద్ధం:

మరోవైపు నీతూ నటరాజ్ సెలెక్ట్ చేసిన గేమ్‌లో షాలిని గెలిచింది. లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నప్పటికీ తనను తక్కువ చేసి మాట్లాడిందంటూ దేబ్జానీని షాలిని నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. ఇక ఇలా మొదటి రోజే నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

ఇక మొత్తానికి, బిగ్ బాస్ హౌస్‌లో ఆరో వారం నామినేషన్లు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. వైల్డ్ ఫైర్స్ ఎంట్రీతో గేమ్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారినా, కంటెస్టెంట్లు నోరు జారి హద్దులు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ వారం నామినేషన్స్‌లో బూతులు మాట్లాడిన అమన్, ముకేశ్‌లపై హోస్ట్ నాగార్జున ఎలాంటి శిక్ష విధిస్తారో, వీరికి రెడ్ కార్డ్ పడుతుందో లేదో వీకెండ్‌ వరకు వేచి చూడాల్సిందే.

Related News

నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?

విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!

Gundeninda GudiGantalu Today episode: ఇదేం ట్విస్ట్ స్వామి.. అడ్డంగా బుక్కయిన విల్లా విజయ్.. రోహిణికి షాక్..

Podarillu Today Episode : బాధపడ్డ మాధవ్.. జమునకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంతమోసమా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Big Stories

Advertisement
×