BigTV English

Gold Mines: భారతదేశంలో 80 శాతం బంగారం అక్కడి నుంచే.. ఎక్కడో తెలుసా?

Gold Mines: భారతదేశంలో 80 శాతం బంగారం అక్కడి నుంచే.. ఎక్కడో తెలుసా?

Gold Mines: బంగారం.. గోల్డ్.. పసిడి.. స్వర్ణం.. ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం.. భారతదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే దానికి ఉండదు. ఇక మగువలు అయితే బంగారం అంటే తెగ ఇష్టపడిపోతుంటారు. జస్ట్ వారికి చిన్నపాటి ధరలో గోల్డ్ గిఫ్ట్ ఇచ్చినా చాలు.. తెగ సంబరపడి పోతుంటారు. పెళ్లికైనా.. ఎంగేజ్‌మెంట్ కు అయినా గోల్డ్ ముచ్చట లేనిది కార్యక్రమం ముందుకెళ్లదు. అది గోల్డ్ కు ఉన్న ఇమేజ్. ప్రస్తుతం బంగారం ధర అక్షరాల లచ్చ రూపాయలు ఉంది.. అయిన మనం ఊరుకుంటామా..? ఎంత ఉన్నా బంగారం కొనుడే.. పెళ్లిల్లో.. వేడుకల్లో ఆభరణాలు ధరించుడే.. అయితే మన భారతదేశంలో బంగారు నిల్వలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి..? వాటి లెక్క ఎంత ఉంటది..? మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువగా బంగారు గనులు ఉన్నాయి..? అనే సమాచారం గురించి చాలా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దీని గురించి క్లియర్ కట్ గా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే..


భారతదేశంలో బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్నాటక. దాదాపు 80 శాతం బంగారం ఉత్పత్తి ఈ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ బంగారు గనులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దేశంలో బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం కర్నాటక. రాష్ట్రంలోని హట్టి బంగారు గని దేశంలోనే ప్రఖ్యాతిగాంచినది. ఎక్కువ మొత్తంలో బంగారం ఈ గని నుంచే లభ్యమవుతోంది. ఈ గని రాయచూరు జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలోని పురాతన, అతిపెద్ద బంగారు గనులలో ఒకటి. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గనిలో ఇప్పటికీ తవ్వకాలు జరుపుతున్నారు. ఏటా దాదాపు 1.8 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. కర్నాటక రాష్ట్రంలో మొత్తం 41 ప్రభుత్వ రంగ గనులు, 232 ప్రైవేట్ రంగ గనులు ఉన్నాయి. ప్రస్తుతం కర్నాటకలో కోలార్ బంగారు గనులు, హుట్టి బంగారు గనులతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారు గనుల తవ్వకం జరుగుతోంది. ఇవి దేశంలోనే అత్యంత ప్రఖ్యాతగాంచినవి. కోలార్ బంగారు గనులు కూడా రాష్ట్రంలోన అత్యంత పురాతనమైన బంగారు గనుల్లో ముఖ్యమైనవి. కోలార్ గనుల్లో చాలా మేలిమి బంగారం ఉత్పత్తి అవుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్నిచోట్ల బంగారం గనులను అధికారులు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 1994లోనే కర్నూలు జిల్లాలో గోల్డ్ నిల్వలు ఉన్నట్లుగా తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో తేలింది. ఇక్కడి దాదాపు 1500 ఎకరాల్లో పసిడి నిల్వలు ఉన్నట్లు అనేక నివేదికల్లో వెల్లడైంది. దీంతో.. ఈ సంపదను వెలికి తీసేందుకు.. ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత 2005లో ఓపెన్ లైసెన్సింగ్ విధానంతో మైనింగ్ లీజు ప్రక్రియను సరళీకరించింది. ఆ నిబంధనల మేరకు.. విదేశీ పెట్టుబడులతో పాటుగా ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల కోసం ప్రభుత్వాలు ఎదురుచూశాయి.


ALSO READ: ప్రపంచంలోనే ఇది పెద్ద గోల్డెన్ సిటీ.. 3000 మీటర్ల లోతులో అంతా గోల్డే

బెంగళూరుకు చెందిన దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. 2013లోనే జొన్నగిరి మండలంలో బంగారాన్ని కనుక్కునేందుకు ట్రయల్స్ ప్రారంభించేందుకు ప్రైమరీ లైసెన్స్‌ను పొందింది. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని అనుమతులు అవసరం కాగా.. అందుకోసం దాదాపు దశాబ్దానికి పైగా సమయం పట్టింది. అలా.. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి 2021లో బంగారు మైనింగ్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 30 వేల బోర్ వెల్స్ వేసి.. ట్రయల్స్ నిర్వహించిన సంస్థ.. మరికొన్నాళ్లలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్న సంస్థ.. జోన్నగిరిలో దాదాపు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టి వివిధ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం తన తరఫున చేయాల్సిన పనుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ALSO READ: మురుగునీటి నుంచి భారీగా బంగారం.. లక్షల్లో సంపాదన

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, నాగర్‌ కర్నూలు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Rainwater business: ఇక్కడ వర్షం నీటిని అమ్మి… కోట్లు గడిస్తున్నారు… ఐడియా అదిరింది కదూ!

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

Big Stories

×