Banks Open: బ్యాంకు ఖాతాదారులు తమ జీవితంలో ఆదివారం బ్యాంకు తెరిచిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఆదివారం బ్యాంకులు ఓపెన్ అయ్యాయి. సమ్మె సమయంలో నెలవారీ ఉచిత పరిమితి ముగిసిన తర్వాత అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఏటిఎమ్‌ల నుండి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఎలాంటి ఛార్జీ ఉండదు.
బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఏవైనా బ్యాంకింగ్ పనులు ఉంటే వాటిని ఆదివారం పూర్తి చేసుకోండి. ఆదివారం సెలవు అయినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తెరిచి ఉన్నాయి. సమ్మె నేపథ్యంలో సోమవారం నుండి బుధవారం వరకు బ్యాంకులు మూసి ఉంటాయి. వారానికి రెండు రోజులు సెలవు కోరుతూ బ్యాంకు ఉద్యోగులు మూడు రోజుల పాటు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాల తర్వాత బ్యాంకులు ఆదివారం తెరుచుకున్నాయి.
2016 ఏడాది నోట్ల రద్దు తర్వాత నవంబర్ 14 ఆదివారం బ్యాంకులు తెరిచి ఉన్నాయి. అప్పుడు పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో ప్రజలు బ్యాంకులకు పోటెత్తారు. రద్దీని నియంత్రించడానికి చివరకు ఆదివారంలో బ్యాంకులను తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సింది. ఇప్పుడు సోమవారం నుంచి మూడు రోజులు సమ్మె నేపథ్యంలో మళ్లీ ఈ ఆదివారం బ్యాంకులు ఓపెన్ అయ్యాయి.
సమ్మె సమయంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎస్‌బిఐ, పిఎన్‌బి సహా అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఏటిఎమ్‌ల నుండి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి నెలవారీ ఉచిత పరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి ఛార్జీ ఉండదు. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం మీ బ్యాంకు ఏటిఎం నుండి నెలకు ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటిఎంల నుండి ఉచిత లావాదేవీల పరిమితి ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో నెలకు మూడు సార్లు, చిన్న నగరాల్లో ఐదు సార్లుగా ఉంది. ఒక నెలలో ఏటీఎం నగదు ఉపసంహరణల పరిమితిని మించి చేస్తే రూ.23 + GST ఛార్జీ విధించబడుతుంది.

ALSO READ: ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రొడక్ట్ వచ్చిందా?రిటర్న్ చేసే ముందు ఈ తప్పులు చేయొద్దు!
ఐదు రోజులతోపాటు బోనస్ నిబంధనల చుట్టూ ఓ వివాదం నెలకొంది. స్కేల్-4, అంతకంటే పై స్థాయిలోని సీనియర్ అధికారుల కోసం ప్రభుత్వం ఒక కొత్త బోనస్ నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం బాగా పనిచేసే అధికారులు 365 రోజుల పాటు తమ మూల్య జీతానికి సమానమైన ప్రోత్సాహకం లేదా బోనస్ పొందవచ్చు. దీనిని బ్యాంకు యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.