E-Paper
Advertisement

ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రొడక్ట్ వచ్చిందా?రిటర్న్ చేసే ముందు ఈ తప్పులు చేయొద్దు!

ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రొడక్ట్ వచ్చిందా?రిటర్న్ చేసే ముందు ఈ తప్పులు చేయొద్దు!
Advertisement

Online wrong product return: ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. బట్టల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నీ ఇంటికే తెప్పించుకుంటున్నాం. అయితే.. కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా పూర్తిగా వేరే లేదా తప్పుడు వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఇలాంటి సమయంలో చాలా మంది కంగారు పడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దాని వల్ల రీఫండ్ రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతుంటారు. మరి తప్పుడు ప్రొడక్ట్ వస్తే.. రిటర్న్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1.ఓపెన్ బాక్స్ డెలివరీ :

ప్రస్తుతం చాలా ఈ-కామర్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ లేదా ఖరీదైన వస్తువుల కోసం ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ విధానాన్ని అందిస్తున్నాయి. అంటే డెలివరీ బాయ్ సమక్షంలోనే బాక్స్ ఓపెన్ చేసి లోపల ఉన్న ప్రొడక్ట్ కరెక్ట్ గా ఉందో లేదో.. చెక్ చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు వస్తువు వస్తే.. అక్కడికక్కడే డెలివరీని రిజెక్ట్ చేసి రిటర్న్ రైజ్ చేయెచ్చు. ఒకవేళ ఓపెన్ బాక్స్ డెలివరీ లేకపోతే..బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కచ్చితంగా అన్-బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయడం చాలా ముఖ్యం.

2.ప్రొడక్ట్ లేబుల్స్, బాక్స్ :

Advertisement

తప్పుడు వస్తువు వచ్చిన వెంటనే.. బాక్స్‌ను పడేయడం లేదా చింపేయడం చేయకూడదు. బాక్స్ పై ఉండే షిప్పింగ్ లేబుల్,బార్‌కోడ్,ఇన్‌వాయిస్ పేపర్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. కంపెనీకి కంప్లైంట్ చేసేటప్పుడు..ఈ లేబుల్ ఫోటోలు లేదా ఆర్డర్ వివరాలు కచ్చితంగా అడుగుతారు. బాక్స్ లేదా ట్యాగ్స్ పాడైపోతే కంపెనీలు రిటర్న్ తీసుకోవడానికి నిరాకరించే అవకాశం ఉంది.

3.తక్షణమే కంప్లైంట్ చేయడం:

వస్తువు రాంగ్ అని తెలిసిన వెంటనే.. అంటే డెలివరీ అయిన 24 నుంచి 48 గంటల్లోపు సంబంధిత యాప్ లేదా వెబ్‌సైట్‌లో ‘Return/Replace’ ఆప్షన్ పై క్లిక్ చేసి రిక్వెస్ట్ పెట్టాలి.ఆలస్యం చేసే కొద్దీ కంపెనీలు అనుమానించే.. అవకాశం ఉంటుంది. రిటర్న్ కారణం రాసేటప్పుడు ‘Received Wrong Item’ అని స్పష్టంగా సెలెక్ట్ చేసి, మనం తీసిన ఫోటోలు లేదా వీడియోను అప్‌లోడ్ చేయాలి.

Advertisement

Also Read: క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?

4.మోసాల పట్ల అప్రమత్తత:

మార్కెట్లో రూ.1,000 నుంచి రూ.50,000 పైగా విలువైన ఎల క్ట్రానిక్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఆన్‌ లైన్‌లో కొంటుంటాం. కొన్ని సార్లు ఫేక్ సెల్లర్లు తక్కువ ధరకు వస్తువులు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతుంటారు. అందుకే ఎప్పుడూ మంచి రేటింగ్స్ ఉన్న ట్రస్టెడ్ సెల్లర్ల దగ్గరే కొనడం మంచిది. ఒకవేళ తప్పుడు వస్తువు వచ్చి, కంపెనీ కస్టమర్ కేర్ సరిగా స్పందించకపోతే కన్స్యూమర్ ఫోరమ్ లో ఫిర్యాదు చేసే హక్కు మీకు ఉంది.

ఆన్‌లైన్ షాపింగ్ ఈజీ అయిన ప్పటికీ, కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు జరగొచ్చు. తప్పుడు వస్తువు వస్తే కంగారుపడకుండా.. పైన చెప్పిన విధంగా అన్-బాక్సింగ్ వీడియో తీయడం, లేబుల్స్ చెక్ చేయడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మీ డబ్బులు, సమయం రెండూ ఆదా అవుతాయి.

Related News

ఇల్లు ఖాళీ చేసాక ఓనర్ డిపాజిట్ ఇవ్వట్లేదా? మీ డబ్బును తిరిగి పొందే సింపుల్ టిప్స్

చాక్లెట్ల పేరుతో ఆటపట్టించి.. ఉద్యోగులకు ఐఫోన్ గిఫ్టులు.. ఈ బాస్ బంగారం బాబోయ్!

కిరోసిన్ దీపం వెలుగులో చదివి రూ.20 లక్షల సాలరీ జాబ్.. వ్యవసాయ కూలీ బిడ్డ ఐపిఎస్ ఆఫీసర్

సూపర్‌హిట్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం నెలకు రూ.25,000 పెన్షన్

పెట్టుబడిలో భారీ నష్టం వస్తే తిరిగి కోలుకోవడానికి ఏం చేయాలి? రికవరీ కోసం ఇలా ప్లాన్ చేయండి

ఖాతాదారులకు అలర్ట్..మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్

హౌస్ వైఫ్స్ కోసం..లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియాలు!

Big Stories

Advertisement
×