E-Paper
Advertisement

హౌస్ వైఫ్స్ కోసం..లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియాలు!

హౌస్ వైఫ్స్ కోసం..లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియాలు!
Advertisement

Buiness ideas for women: కుటుంబ బాధ్యతలను మోస్తూనే.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, సొంతంగా సంపాదించాలని కలలు కనే మహిళలకు నేడు డిజిటల్ యుగం అద్భుతమైన మార్గాలను అందిస్తోంది. భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా.. మీ చేతిలోని స్మార్ట్‌ ఫోన్, మీలోని ప్రత్యేక నైపుణ్యాలతోనే ఇంటర్‌ నెట్ సాయంతో.. సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయెచ్చు. బయటకు వెళ్లలేకపోతున్నామని.. బాధపడే మహిళల కోసం.. ఇంటి పనులను చక్క బెట్టుకుంటూనే.. నెలకు వేల రూపాయలు సంపాదించగలిగే కొన్ని బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక లాభాలు తెచ్చే బిజినెస్ ఐడియాలు:

1. హోమ్ మేడ్ స్నాక్స్ అండ్ హెల్తీ టిఫిన్స్:

నేటి బిజీ లైఫ్‌ స్టైల్‌లో చాలా మంది ఆరోగ్యకరమైన,ఇంట్లో తయారు చేసిన రుచికరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఉద్యోగస్తులు, బ్యాచిలర్స్ కోసం మీరు హెల్తీ టిఫిన్స్, స్నాక్స్, లేదా స్పెషల్ పచ్చళ్లను తయారు చేసి ఆన్‌లైన్ ద్వారా లేదా లోకల్ కస్టమర్లకు అమ్మొచ్చు.

Advertisement

పెట్టుబడి /ధర:రూ.1,000- రూ.2,000 (ఇంట్లో ఉన్న వస్తువులు , మొదటి సారి తయారీకి ఉపయోగించవచ్చు).

మోడల్: ఆర్డర్ ఆన్ బేసిస్ లేదా రోజువారీ సబ్‌స్క్రిప్షన్ పద్ధతి.

2. కస్టమైజ్డ్ గిఫ్టింగ్ అండ్ క్రాఫ్ట్స్ :

Advertisement

బర్త్‌డేలు, పెళ్లి రోజులు ,పండగలకు కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఫోటో ఫ్రేమ్‌లు, రెస్పిన్ ఆర్ట్స్, హ్యాండ్‌ మేడ్ క్యాండిల్స్ లేదా బొకేలు తయారు చేయడంలో.. మీకు ఆసక్తి ఉంటే.. ఈ బిజినెస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా పేజీల ద్వారా మీ ప్రొడక్ట్స్ ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు.

పెట్టుబడి /ధర: రూ.500- రూ.1,500 (రా మెటీరియల్ కోసం).

మోడల్: సోషల్ మీడియా ఆర్డర్లు , ప్రీ-బుకింగ్ మోడల్.

3. ఆన్‌లైన్ ట్యూషన్స్ లేదా కంటెంట్ క్రియేషన్ :

మీకు చదువు చెప్పడంలో ఆసక్తి ఉంటే పిల్లలకు ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్స్ చెప్పొచ్చు. అలాగే వంటలు చేయడం,బ్యూటీ టిప్స్ లేదా వ్లాగింగ్ పట్ల మక్కువ ఉంటే మీ టాలెంట్‌ను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా గూగుల్ అడ్సెన్స్ , స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సంపాదించొచ్చు.

పెట్టుబడి :రూ.0 (స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఉంటే సరి పోతుంది).

మోడల్: అవర్స్ బేసిస్ లేదా యాడ్ రెవెన్యూ మోడల్.

Also Read: క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?

4. రీసెలర్ బిజినెస్:

ఎలాంటి తయారీ ఖర్చు లేకుండా కేవలం మొబైల్ ఫోన్ ద్వారా చేయగల వ్యాపారం ఇది. కొన్ని ప్రముఖ రీసెల్లింగ్ యాప్స్ ద్వారా బట్టలు, ఇంటికి అవసరం అయిన ప్రొడక్ట్స్ మీ వాట్సాప్ గ్రూపులు లేదా సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆర్డర్లు రాగానే మీ మార్జిన్ కలుపుకుని అమ్మొచ్చు.

పెట్టుబడి : పూర్తిగా జీరో ఇన్వెస్ట్‌మెంట్.

మోడల్: కమిషన్ లేదా ప్రాఫిట్ మార్జిన్ మోడల్.

కాబట్టి మీ వ్యాపారాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ..కస్టమర్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే అద్భుతమైన లాభాలు పొందొచ్చు.

Related News

క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?

రూ.50 లక్షల పెట్టుబడితో రూ.50 కోట్ల రాబడి.. 21 ఏళ్ల యువతి జాక్‌పాట్

తక్కువ రేట్ అని బట్టలు కొంటున్నారా? ఈ మోసం గురించి తెలిస్తే అస్సలు షాపింగ్ చేయరు!

తల్లి, భార్య, కూతురు కోసం.. అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్‌లు.. జీరో రిస్క్, గ్యారెంటీ లాభం!

రూ.5వేల పెట్టుబడితో రూ.5 లక్షలు చేతికి ! సిప్ మ్యాజిక్ ఇదే

కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!

కేంద్రంపై వర్తకుల తిరుగుబాటు.. అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్స్ పని చేయవు! No UPI Day

Big Stories

Advertisement
×