E-Paper
Advertisement

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Toyota Land Cruiser New Generation: ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఇప్పుడు కొత్త రూపంలోకి మారేందుకు సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా తన బాక్సీ డిజైన్, భారీ నిర్మాణం, ఆఫ్‌రోడ్ సామర్థ్యంతో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న ఈ SUV.. కొత్త తరంలో ఆధునిక టెక్నాలజీని జోడించుకోనుంది. అయితే, లుక్ లో ఎంత మార్పు వచ్చినా, ల్యాండ్ క్రూయిజర్‌కు ప్రత్యేకమైన దృఢమైన లుక్ మాత్రం అలాగే ఉండేలా టయోటా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

లుక్‌ లో భారీ మార్పులు!

లీక్ అయిన ఫోటోలను పరిశీలిస్తే కొత్త ల్యాండ్ క్రూయిజర్ గత మోడల్ కంటే మరింత అత్యాధునికంగా కనిపిస్తోంది. ముందు భాగంలో పెద్ద క్రోమ్ గ్రిల్, సన్నగా కనిపించే LED హెడ్‌ల్యాంప్‌లు, కొత్త డిజైన్ బంపర్లు  మరింతగా ఆకట్టుకోనున్నాయి. వెడల్పుగా కనిపించే వీల్ ఆర్చ్‌ లు, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్‌లు SUVకు మరింత బలమైన లుక్ ఇవ్వనున్నాయి. బాక్సీ లుక్ పూర్తిగా మార్చకుండా, దానికి అత్యాధునిక టచ్ ఇవ్వడమే టయోటా లక్ష్యంగా కనిపిస్తోంది.

క్యాబిన్‌ లోనూ కొత్త ఎక్స్ పీరియెన్స్

Advertisement

బయటి డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ కీలక ఛేంజెస్ రానున్నాయి. కొత్త షేడ్, మెరుగైన అప్‌హోల్స్టరీతో క్యాబిన్‌ను మరింత ప్రీమియంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇందులో 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అంటే, సంప్రదాయ ఆఫ్‌రోడ్ SUV లక్షణాలతో పాటు, ప్రీమియం కార్లకు ఉండే టెక్నాలజీని కూడా ల్యాండ్ క్రూయిజర్ అందుకోనుంది.

రెండు V6 ఇంజిన్లతో వచ్చే అవకాశం!

కొత్త ల్యాండ్ క్రూయిజర్‌లో పవర్‌ ట్రెయిన్ విషయంలోనూ పెద్ద మార్పులు రానున్నాయి. ఇందులో 3.3 లీటర్ V6 డీజిల్, 3.5 లీటర్ ట్విన్-టర్బో V6 పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆఫ్‌ రోడ్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 4WD డ్రైవ్‌ ట్రెయిన్‌ ను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్‌ ను కూడా టయోటా తీసుకురావచ్చని తెలుస్తోంది.

భారత్‌లోకిఎంట్రీ  ఎప్పుడు?

Advertisement

కొత్త తరం ల్యాండ్ క్రూయిజర్‌ను తొలుత అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసి, అనంతరం భారత్‌కు తీసుకురావాలని టయోటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లో ఇది పూర్తిగా దిగుమతి చేసుకునే మోడల్‌గా వచ్చే అవకాశం ఉండటంతో ధర విషయంలో మాత్రం ప్రీమియం స్థాయిలోనే ఉండనుంది. గత మోడల్ ల్యాండ్ క్రూయిజర్ ధర కోటి రూపాయల మార్క్‌ ను దాటిన నేపథ్యంలో, కొత్త మోడల్ భారత్‌లోకి వస్తే దాని ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Read Also: టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!

Tags

Related News

259 కిమీ రేంజ్‌ తో నిస్సాన్ కొత్త EV.. చిన్న కారులో అదిరిపోయే ఫీచర్లు!

పల్సర్‌కు మళ్లీ పాత జోష్ వస్తుందా? కొత్త 125, 150తో బజాజ్ మాస్టర్ ప్లాన్!

టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!

టాటా నంబర్ వన్.. మహీంద్రా నెక్స్ట్.. విన్‌ఫాస్ట్ స్పీడ్ చూస్తే షాక్!

రిలీజ్ కు ముందే టాటా ఏరిస్ వీడియో లీక్.. CNG మోడల్‌ లో ఇవే హైలైట్స్!

బజాజ్ పల్సర్ లో అదిరిపోయే అప్‌డేట్.. TFT స్క్రీన్‌తో కొత్త లుక్!

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

Big Stories

Advertisement
×