E-Paper
Advertisement

మీ ఫోన్‌ను వేరొకరికి ఇస్తున్నారా? స్క్రీన్ లాక్ మాత్రమే సరిపోదు!ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మీ ఫోన్‌ను వేరొకరికి ఇస్తున్నారా? స్క్రీన్ లాక్ మాత్రమే సరిపోదు!ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Advertisement

Smartphone privacy:  మన స్మార్ట్‌ ఫోన్.. ఇప్పుడు కేవలం మాట్లాడేందుకు ఉపయోగపడే గాడ్జెట్ మాత్రమే కాదు, మన పర్సనల్ లైఫ్‌కి అద్దం పడుతుంది. ప్రైవేట్ ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు, పర్సనల్ చాట్స్..ఇలా ప్రతిదీ మన ఫోన్‌లోనే ఉంటాయి. ఎవరైనా.. ఒక్క కాల్ చేసుకోవడానికో.. లేదా ఫోటోలు చూడడానికో.. ఫోన్ అడిగినప్పుడు “కాదనలేక” అన్‌ లాక్ చేసి చేతిలో.. పెడుతుంటాం. కానీ.. కేవలం ‘స్క్రీన్ లాక్’పై ఆధారపడి ఫోన్ ఇస్తే.. మీ డేటా ప్రైవసీకి పెను ప్రమాదం పొంచి ఉన్నట్లే! అందుకే.. ఇతరులకు ఫోన్ ఇచ్చేటప్పుడు వాడాల్సిన కొన్ని లేటెస్ట్, పవర్‌ఫుల్ ప్రైవసీ ఫీచర్లు ఇవే.

 5 ట్రెండీ సెక్యూరిటీ హ్యాక్స్:

మన ఫోన్ ఫ్రెండ్స్ లేదా పిల్లల చేతికి వెళ్లినప్పుడు, వారు మనం ఇచ్చిన పని మాత్రమే కాకుండా… పొర పాటున గ్యాలరీ, వాట్సాప్ లేదా.. బ్యాంకింగ్ యాప్స్‌లోకి.. తొంగిచూసే అవకాశం ఉంది. ఈ ప్రైవసీ రిస్క్‌లకు చెక్ పెట్టే సూపర్ ఫీచర్లు ఇవే..

1. యాప్ పిన్నింగ్ :

Advertisement

ఎవరైనా మీ ఫోన్ కేవలం యూట్యూబ్ చూడడానికో.. లేదా కాల్ చేయడానికో అడిగితే.. ఈ ఫీచర్ ఒక వరం లాంటిది. మీరు ఏ యాప్ అయితే ఓపెన్ చేసి ‘పిన్’ చేస్తారో.. వారు ఆ ఒక్క యాప్‌లో తప్ప వేరే ఎక్కడికీ వెళ్లలేరు.

ఎలా సెట్ చేయాలి?: ఫోన్ సెట్టింగ్స్ > సెక్యూరిటీ & ప్రైవసీ > ‘App Pinning’ లేదా ‘Screen Pinning’ ఆన్ చేయండి.

Advertisement

హైలైట్: వారు బ్యాక్ బటన్ కొట్టినా.. హోమ్ స్క్రీన్‌కి వెళ్లాలని చూసినా ఫోన్ వెంటనే లాక్ అయిపోతుంది. మీ పాస్‌ వర్డ్ కొడితేనే అన్‌లాక్ అవుతుంది.

2. గెస్ట్ మోడ్ :
మీ ఫోన్ ఒక రోజంతా.. లేదా కాసేపు వేరొకరికి ఇవ్వాల్సి వస్తే.. ‘గెస్ట్ మోడ్’ ఆన్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇది మీ మెయిన్ ప్రొఫైల్‌ను దాచేసి, ఫోన్‌‌ను కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా మార్చేస్తుంది.

ఎలా సెట్ చేయాలి?: నోటిఫికేషన్ బార్.. కిందకు లాగి, ప్రొఫైల్/యూజర్ ఐకాన్‌‌పై టాప్ చేసి ‘Guest’ఆప్షన్ ఎంచుకోండి.

హైలైట్: ఇందులో.. మీ వాట్సాప్, ఫోటోలు, మెసేజ్‌లు, పర్సనల్ అకౌంట్స్ ఏవీ కనిపించవు. మీ డేటా 100% సేఫ్!

3. యాప్ లాక్ :
ఫోన్ అన్‌లాక్ చేసి ఇచ్చినా కూడా… మీ గ్యాలరీ, పేటీఎం, గూగుల్ పే, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌‌లకి ప్రత్యేకంగా లాక్ వేసి ఉంచడమే.. ‘యాప్ లాక్’.

హైలైట్: ఫోన్ అన్‌లాక్ అయినప్పటికీ.. ఈ ముఖ్యమైన యాప్‌లు ఓపెన్ చేయాలంటే.. మీ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ లాక్ తప్పని సరి. దీంతో మీ సీక్రెట్స్ మీ దగ్గరే భద్రంగా ఉంటాయి.

4. సెన్సిటివ్ నోటిఫికేషన్స్ హైడ్:
ఫోన్ లాక్‌లో ఉన్నప్పటికీ డిస్‌ప్లేపై.. వచ్చే నోటిఫికేషన్స్ ద్వారా బ్యాంకింగ్ ఓటీపీలు లేదా ఇతరుల పర్సనల్ మెసేజ్‌లు కనిపించే ప్రమాదం ఉంది.

ఎలా సెట్ చేయాలి?: సెట్టింగ్స్ > నోటిఫికేషన్స్ లోకి వెళ్లి “Hide Sensitive Content” లేదా “Hide Notification Content on Lock Screen” మోడ్ ఎనేబుల్ చేయండి.

హైలైట్: ఫోన్ అన్‌లాక్ అయితే తప్ప మెసేజ్‌లో ఏముందో ఎవ్వరూ చూడలేరు.

Also Read: రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

5. ఐఫోన్ గైడెడ్ యాక్సెస్:
మీరు ఐఫోన్ ఉపయోగిస్తుంటే.. ‘Guided Access’ మీ ప్రైవసీకి కొండంత అండ. ఇది ఆండ్రాయిడ్ పిన్నింగ్ కంటే.. ఒక అడుగు ముందే ఉంటుంది.

హైలైట్: ఇది ఒక్క యాప్‌కే ఫోన్‌ను పరిమితం చేయడమే కాకుండా.. స్క్రీన్‌పై నిర్దిష్ట భాగాలను (ఉదాహరణకు సెర్చ్ బార్ లేదా సెట్టింగ్స్ ఐకాన్) టచ్ పని చేయకుండా లాక్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది.

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ.. ప్రైవసీ రిస్క్‌లు కూడా పెరుగుతున్నాయి. “మన వాళ్లే కదా” అని నిర్లక్ష్యంగా.. ఫోన్ ఇచ్చేయకుండా.. ఈ చిన్న చిన్న సెక్యూర్ ట్రిక్స్ వాడడం అలవాటు చేసుకోండి. డిజిటల్ వరల్డ్‌లో మీ డేటా ప్రైవసీకి మీరే బాస్!

Related News

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో..ఊహించని ధరకే ఎయిర్ ఫ్రైయర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

Big Stories

Advertisement
×